తెలంగాణ

ఉద్యోగులకు తీపికబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే నెలలో పిఆర్‌సి బకాయిల చెల్లింపు

ఫైల్‌పై సిఎం కెసిఆర్ సంతకం రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ బకాయిల మొత్తం రూ. 3వేల కోట్లు

హైదరాబాద్, మే 22: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. వీరికి చెందిన పిఆర్‌సి బకాయిలను ఎట్టకేలకు చెల్లంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల జూన్ వేతనంతో కలిపి పిఆర్‌సి బకాయిలలో 50 శాతం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై ముఖ్యమంత్రి సోమవారం సంతకం చేసారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం పిఆర్‌సి బకాయిలు రూ. 3 వేల కోట్లు ఉండగా అందులో సగం డబ్బును జూన్‌లో వేతనం పాటు చెల్లిస్తుంది. మిగతా సగాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదవ వేతన సవరణ (పిఆర్‌సి) సిఫారసుల మేరకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను జూన్ 2014 (తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం) నుంచి అమలు చేస్తుంది. జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2015 వరకుగల తొమ్మిది నెలల బకాయిలను పక్కన పెట్టి 2015 మార్చి నుంచి సవరించిన పిఆర్‌సిని అమలు చేస్తుంది. పిఆర్‌సి బకాయిలు, ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేత తదితర ప్రధాన డిమాండ్లపై టిఎన్‌జిఓ నాయకులు కారం రవీందర్‌రెడ్డి, దేవిప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తదితరుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌తో సమావేశమై చర్చించారు. ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రితో సంప్రదించి సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు సిఎస్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో పాటు సంబంధిత ఫైల్‌పై సోమవారం సంతకం పెట్టారు. పిఆర్‌సి బకాయిలు అందుకోనున్న వారిలో 3 లక్షల మంది ఉద్యోగులు, రెండున్నర లక్షల మంది పెన్షనర్స్ ఉండగా ఇందుకుగాను రూ. 3 వేల కోట్లు ప్రభుత్వంపై భారం పడనుంది. ఇలా ఉండగా పిఆర్‌సి బకాయిల చెల్లింపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు. బకాలు చెల్లించడంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విఫ్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి నుంచి చెబుతూ ఉన్నారని గుర్తు చేశారు.