తెలంగాణ

టాపర్ జయంత్ అగ్రికల్చర్ స్ట్రీంలో నిస్తాంరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్సెట్ ఫలితాలు వెల్లడి
ఇంజనీరింగ్‌లో 93.46 శాతం మందికి అర్హత
టాప్ టెన్‌లో ఆరుగురు తెలంగాణేతరులే
అగ్రికల్చర్‌లో 92.99 శాతం అర్హత
టాప్ టెన్‌లో ఐదుగురు తెలంగాణేతరులే
ఎమ్సెట్ పాసైనా 20,807 మంది ఇంటర్ ఫెయిల్

హైదరాబాద్, మే 22: తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ, ఫారెస్ట్రీ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఎమ్సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, సెట్ చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్యలు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఎమ్సెట్ పాసైనా 20,807 మంది ఇంటర్ ఫెయిలయ్యారు, మరో 3222 మంది అర్హత పరీక్ష ఫలితాలు కమిటీకి నేటికీ అందలేదు. దాంతో వారికి ఎమ్సెట్ ర్యాంకును కేటాయించలేదు. 1,41,136 మంది ఇంజనీరింగ్‌కు, 79,033 మంది అగ్రికల్చర్ స్ట్రీంకు కలిపి 2,20,248 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో 98,596 మంది ఇంజనీరింగ్‌కు, 63,570 మంది అగ్రికల్చర్ స్ట్రీంలో అర్హత సాధించారు. ఇంజనీరింగ్ స్ట్రీంలో 74.75 శాతం, అగ్రికల్చర్ స్ట్రీంలో 86.49 శాతం ఉత్తీర్ణులయ్యారని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ టాప్ టెన్‌లో ఆరుగురు, అగ్రికల్చర్ స్ట్రీంలో ఐదుగురు తెలంగాణేతరులు ఉన్నారు.
ఇంజనీరింగ్ స్ట్రీంలో గోరంట్ల జయంత్ హర్ష (గుంటూరు) మొదటి ర్యాంకు సాధించగా, రెండో ర్యాంకు కిలారి రాంప్రసాద్ (శ్రీకాకుళం), 3వ ర్యాంకు అవ్వారి సాయి భరద్వాజ (అశ్వాపురం), 4వ ర్యాంకు డి శైలేంద్ర బాబు (అమలాపురం) సాధించారు. ఐదో ర్యాంకు వి మోహన్ అభ్యాస్ (హైదరాబాద్), ఆరో ర్యాంకు చంగం దిలీప్ కుమార్‌రెడ్డి (తాడిపర్తి), ఏడో ర్యాంకు ఎంవిఎస్‌ఎన్ ప్రణీత్ (మాదాపూర్), 8వ ర్యాంకు సత్యం రల్‌హన్ (కాంచీపురం), 9వ ర్యాంకు అబ్దుల్ మోయిజ్ (మచిలీపట్నం), 10వ ర్యాంకు బి నిఖిల్ (మాదాపూర్) సాధించారు. అగ్రికల్చర్ స్ట్రీంలో కెఎన్‌విఎస్‌ఎన్ నిస్తాంరెడ్డి (కాకినాడ) మొదటి ర్యాంకు సాధించాడు. 2వ ర్యాంకు జిపి సుందర్‌రెడ్డి (ఒంగోలు), 3వ ర్యాంకు గొటూరి అనినవ్ రెడ్డి (గజ్వేల్), 4వ ర్యాంకు జి మనోజ్ పవన్ రెడ్డి (హిందూపూర్), 5వ ర్యాంకు ఎన్ మాన్విత (ప్రొద్దుటూరు), ఆరో ర్యాంకు ఉటుకూరి వెంకట అనిరుధ్ (గుంటూరు), ఏడో ర్యాంకు వంశీకృష్ణ కాజా (హైదరాబాద్) సాధించారు. 8వ ర్యాంకు దేవుల మాన్సి దినేష్ (హైదరాబాద్) 9వ ర్యాంకు పిన్ సాయి చంద్ర ( పెబ్బేరు), 10వ ర్యాంకు వై అలేఖ్య (నిజామాబాద్) సాధించారు.
24 నుంచి ఒఎంఆర్ షీట్లు
ఈనెల 24 నుంచి ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచుతామని, అభ్యర్ధులు వాటిని చూసుకోవచ్చని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తుది కీ నెట్‌లో ఉంచామన్నారు. ర్యాంకు కార్డులను 28 నుండి వెబ్ పోర్టల్‌లో అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
బిసి ఎ నుండి ఇంజనీరింగ్‌లో 5416, అగ్రికల్చర్‌లో 4506 మంది, బిసి బి నుండి ఇంజనీరింగ్‌లో 7855, అగ్రికల్చర్‌లో 11,123 మంది అర్హత సాధించారు. బిసి సి నుండి ఇంజనీరింగ్‌లో 564 మంది, అగ్రికల్చర్‌లో 634 మంది అర్హత సాధించారు. బిసిడి నుండి ఇంజనీరింగ్‌లో 15,809 మంది, అగ్రికల్చర్ నుండి 10604 మంది, బిసి ఇ నుండి ఇంజనీరింగ్‌లో 4294 మంది, అగ్రికల్చర్ నుండి 5081 మంది, ఒసి ఇంజనీరింగ్ నుండి 37432 మంది, అగ్రికల్చర్ నుండి 12090, ఎస్సీ ఇంజనీరింగ్ నుండి 10280, అగ్రికల్చర్ నుండి 13156 మంది, ఎస్టీ ఇంజనీరింగ్ నుండి 5703, అగ్రికల్చర్ నుండి 6376 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 7378 మంది, అగ్రికల్చర్ విభాగంలో 7887 మంది మైనార్టీలు అర్హత సాధించారు.