కృష్ణ

శక్తి, యుక్తి, భక్తి, త్రివేణి తీర్థం ఆంజనేయస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, మే 22: శక్తి, యుక్తి, భక్తి, త్రివేణి తీర్థంగా సంగమించిన వ్య క్తిత్వం కలిగిన మహానీయుడు ఆంజనేయస్వామి మాత్రమేనని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకుడు బ్రహ్మశ్రీ పసుమర్తి కామేశ్వరశర్మ పేర్కొన్నారు. ముత్యాలంపాడు శ్రీ కోదండ రామాలయంలో హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా 2వ రోజైన సోమవారం ఆధ్యాత్మికసభ జరిగింది. ఈసందర్భంగా పసుమర్తి భక్తులను ఉద్దేశిం చి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ‘మాట’ అత్యంత ప్రధాన విషయమన్నారు. ఒక వ్యక్తి మాట్లాడే సందర్భంలోనే వ్యక్తి గుణగణాలను పూర్తిగా ఎదుట వ్యక్తి ఎంతో తేలిగ్గా గ్రహించటం జరుగుతుందన్నారు. ఆ మనిషి మాట్లాడిన తీరు తల వ్యక్తిత్వానికి అద్దం పడుతోందన్నారు. ఇదేవిధంగా మాటతోనే ఒక వ్యక్తి పై స్థాయికి ఎదగటానికి ఒక చక్కటి మార్గమని పసుమర్తి భక్తులకు వివరించారు. శ్రీ మద్రామాయణంలో ఆంజనేయుని శక్తి సామర్థ్యాలు యుక్తి విశేషాలు, శక్తి నైపుణ్యం, వ్యక్తత్వ వైభవం, కిస్కంధ, సుందర కాండ అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పబడిందని నేటి యువత ఆంజనేయస్వామిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందటానికి అవకాశం ఉంటుందని పసుమర్తి వివరించారు. నిత్యం భక్తుల చేత పూజలందుకుంటున్న శ్రీ రాముడు సేవకుడైన ఆంజనేయస్వామి కూడా పూజలు అందుకోవటం వెనుక ఆయనకు ఉన్న వ్యక్తిత్వమే ముఖ్యకారణమని పసుమర్తి వివరించారు.