రాష్ట్రీయం

ఒంటరిగానే పోటీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 27: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, పొత్తుపై అందరి సమక్షంలో కేంద్రంలో నిర్ణయం తీసుకుంటారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. శనివారం స్థానిక గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం హిందూ దేశం కావాలని ప్రయత్నిస్తోందని, ఇది సెక్యులర్ దేశమని, అన్ని మతాలుంటాయని ప్రధాని మోదీ గుర్తించాలని చెప్పారు. సంగారెడ్డిలో జూన్ ఒకటో తేదీన నిర్వహించే బహిరంగ సభలో రాహుల్‌గాంధీ రైతుల గురించి మాట్లాడతారని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో చెన్నారెడ్డి విజయదుందుభి మోగించారని గుర్తుచేశారు. మెదక్ జిల్లాకు ఆనాడు నానమ్మ ఇందిరమ్మ రాగా, ఇపుడు మనవడు రాహుల్‌గాంధీ వస్తున్నారని పేర్కొన్నారు. దివంగత ప్రధాని ఇందిరగాంధీ మెదక్‌లో పోటీ చేసి గెలిచిన తర్వాత అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారని అన్నారు. నానమ్మ స్థలంలో మనవడు రాహుల్‌గాంధీ వస్తున్నారని వివరించారు. పోలీసు శాఖకు 500 కోట్లు ఇచ్చిన సిఎం కేసిఆర్ మిర్చి, పసుపు రైతులను ఆదుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గవర్నర్ పదవికి అర్హుడు కాదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, కార్యకర్తల బలం ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ప్రకటించిన కెసిఆర్ మాటతప్పారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో పిసిసి కార్యదర్శి బి.కృష్ణ, డిసిసిబి డైరక్టర్ ఎన్.కిషన్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు మహ్మద్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.