రాష్ట్రీయం

రాష్ట్ర విభజన దంపతులను విడదీసేందుకు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్.శోభారాణిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని హైదరాబాద్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించింది భార్యా, భర్తలనువిడదీసేందుకు కాదని హైకోర్టు అభిప్రాయపడింది. జోన్-4లోని కర్నూలులో 1992 సంవత్సరం జూలై 20న డాక్టర్ ఎస్. శోభారాణి లెక్చరర్‌గా నియమితులయ్యారు. ఆమె భర్త విశాఖపట్నంలోని బిహెచ్‌ఇఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. భర్త/్భర్య (స్పౌస్) కేసు కింద ఆమె తనను విశాఖపట్నానికి బదిలీ చేయాల్సిందిగా కోరారు. అనంతరం ఆమెను బదిలీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆమెను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు తనను బదిలీ చేయడాన్ని ఆమె కోర్టులో సవాల్ చేశారు.
జస్టిస్ పివి.సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్.బాలయోగితో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారణకు స్వీకరించి ఇరుపక్షాల వాదనలు విన్నది. బిహెచ్‌ఇఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ అని కేంద్రం తెలిపింది. రాష్ట్ర పునర్విభజన తర్వాత స్పౌస్ కేసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర పునర్విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే క్లాజ్(1) కింద పరిగణలోకి తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ రంగ ఉద్యోగులను పరిగణలోకి తీసుకోలేమని చెప్పడం సరైంది కాదని పేర్కొంది. ఈ కేసులో ఆమె భర్త బిహెచ్‌ఇఎల్‌లో బదిలీ కానటువంటి ఉద్యోగంలో ఉన్నారని, ఇంకా ఆమె పిల్లలు కూడా విశాఖపట్నంలోనే చదువుకుంటున్నారని కోర్టు తెలిపింది. పైగా ఆమె కుటుంబంతో కలిసి ఉండేందుకు సీనియారిటీని పొగొట్టుకున్నట్లు వివరించింది. భార్య-్భర్తలు కలిసి ఒకే చోట ఉద్యోగం చేసుకునేలా చూడాలని, ఇందుకు అనుగుణంగా నియమ, నిబంధనలు ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. డాక్టర్ శోభా రాణిని ఆంధ్రకు బదిలీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది.