తెలంగాణ

‘దందా’పై దయ చూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: కూకట్‌పల్లి పరిధిలో 547 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కుంభకోణంలో ఎవ్వరినీ వదిలేది లేదని, విచారణ జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. భూ కుంభకోణం వ్యవహారంపై సోమవారం అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ల శాఖ పరువు తీసేలా సబ్ రిజిస్ట్రార్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. మొత్తం 547 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేశారని వివరించారు. ఎక్కడినుంచైనా భూమి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉండటం వల్లే కుంభకోణం జరిగిందన్న విమర్శలకు సమాధానమిస్తూ, ప్రజలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఈ విధానం తీసుకొచ్చామన్నారు. 48 గంటల్లో ఆ భూమి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ అనుమతి లిఖిత పూర్వకంగా తీసుకున్న తరువాతే ఎక్కడైనా రిజిస్టర్ చేసే విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ కుంభకోణం గురించి సిఎంకు వివరించి, శాఖను ప్రక్షాళన చేయనున్నట్టు చెప్పారు.
547 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా రిజిస్టర్ చేసిన అంశం అంతర్గత ఆడిట్‌లో బయటపడిందని, వెంటనే పోలీసులకు జిల్లా రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారన్నారు. నాలుగు నెలలకు జరిగిన ఆడిట్‌లో ఇది భయటపడిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ప్రతి నెలా ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అదేవిధంగా చాలాకాలం నుంచి ఒకే ప్రాంతంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కోర్టు ఆనుమతితో మియాపూర్ సబ్ రిజిస్ట్రార్ అక్కడే కొనసాగారని చెప్పారు. కుంభకోణానికి పాల్పడిన సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్టు చేయడంతోపాటు అంతర్గతంగా మొత్తం వ్యవహారంపై విచారణ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. తానెలాంటి తప్పూ చేయలేదని సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు చెబుతున్న అంశంపై మీడియా ప్రశ్నించగా, తప్పు చేయడం కాదు, దొంగ పని చేసి సమర్ధించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.