జాతీయ వార్తలు

అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు బడ్జెట్ సమావేశాల్లోనే పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మార్చ్ 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించి తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో సీట్ల సంఖ్య పెంపునకు ఉద్ధేశించిన బిల్లును రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణకు సివిల్ సర్వీస్ అధికారల కేటాయింపును పెంచాలని, రాష్ట్రంలోని నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని కూడా కోరామని, తమ ప్రతిపాదనల పట్ల రాజ్‌నాథ్ ఎంతో సానుకూలంగా స్పందించాలని కెటిఆర్ విలేఖర్లకు తెలిపారు. కెటిఆర్‌తో పాటు తెరాస నాయకులు వినోద్ కుమార్, సీతారాం నాయక్, బిబి.పాటిల్, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాల చారి బృందం హోం మంత్రిని కలుసుకున్నారు. తెలంగాణలో సివిల్ సర్వీస్ అధికారుల కొరత తీవ్రంగా ఉందని, ఐపిఎస్ అధికారులు 141 మంది అవసరం కాగా 112 మంది మాత్రమే ఉన్నారని, కనుక అదనంగా మరో 29 మందిని కేటాయించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరామని కెటిఆర చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఐపిఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై సొంత రాష్ట్రానికి పంపాలని, లేక వారు కోరుకుంటే తెలంగాణకు బదిలీ చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని కెటిఆర్ చెప్పారు. హైకోర్టు విభజన గురించి కూడా కేంద్రంపై వత్తిడి తెస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా ఇది పరిష్కారం అవుతుందనే విశ్వాసం ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో హైకోర్టు విభజన గురించి చర్చించారని కెటిఆర్ వెల్లడించారు.
ఉపాధి హామీని వ్యవసాయంతో
అనుసంధానించాలి..
అలాగే కెటిఆర్ మంగళవారం మ ధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కూడా కలసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని కెటిఆర్ తెలిపారు. ఇది చాలా మంది ప్రతిపాదన అని, దీని అమలు కోసం పైలట్ ప్రాజెక్టును తయారు చేసుకురావాలసిందిగా బీరేంద్ర సింగ్ తననను కోరారని కెటిఆర్ చెప్పారు. గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు పారిశుద్ధ్య కార్మికులను కూడా ఉపాధి హామీ పథకంతో అనుసంధానించి వారికి కనీస వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశామని, దీంతో ఏప్రిల్ 20వ తేదీన తెలంగాణలో క్షేత్ర స్థాయి పర్యనటన జరిపేందుకు బీరేంద్ర సింగ్ అంగీకరించారని కెటిఆర్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల మూలంగా రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిధులు రాలేదని కెటిఆర్ ఆరోపించారు. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఇప్పుడు రూ.3 వేలకోట్లు కేటాయించాలని బీరేంద్ర సింగ్‌ను కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో రోడ్లు, 172 వంతెనల నిర్మాణం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున సహాయం చేయాలని కోరగా బీరేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారని కెటిర్ చెప్పారు.

చిత్రం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన మంత్రి కె.తారక రామారావు