తెలంగాణ

సినారె అంత్యక్రియలకు ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహిత, దివంతగ డాక్టర్ సి. నారాయణ రెడ్డి అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. డాక్టర్ సినారెను కడసారి దర్శించుకుని, అంత్యక్రియల్లో పాల్గొనాలనుకునే వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి 100 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణా రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారిని తిరిగి చేర్చనున్నట్లు తెలిపారు. వివరాలకు జిల్లా కేంద్రాల్లోని సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.