తెలంగాణ

ప్రభుత్వం చర్చలు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 15 నుంచి సమ్మె చేస్తున్న కార్మికులపై సింగరేణి యాజమాన్యం నిర్బంధ చర్యలకు పాల్పడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ నిర్బంధాన్ని ఆపాలని కోరారు. సోమవారం నాడిక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే మరో వైపు సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధిని చూపడం లేదని అన్నారు.
సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులపై ప్రభుత్వం కొనసాగిస్తున్న పోలీసు నిర్బంధాన్ని ఖండించాలని, సమ్మెకు అండగా నిలవాలని ప్రజలకు, కార్మిక వర్గానికి, మేధావులకు ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులుగా దాదాపు 1200 మంది కార్మికులను నిర్బంధించి రోజంతా జైల్లో ఉంచి విడుదల చేశారని, సింగరేణిలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి ర్యాలీలు, ప్రదర్శనలను అడ్డుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశాయి. వారసత్వ ఉద్యోగాల విషయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ కుటిల రాజకీయం వల్లే సమస్య జఠిలమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు, టిఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎంకె బోస్, ఇతర కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.