తెలంగాణ

వర్షపు నీటితో జూరాలకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 19: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత ఏడాదితో పోల్చుకుంటే ముందస్తు నీరు చేరి ఆయకట్టు రైతులను ఆనందపరుస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరివాహాక ప్రాంతాల నుండి వచ్చిన నీటి చేరికతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగంతో పాటు ఇరిగేషన్ అధికారులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి నీరు రాకున్నప్పటికీ పరివాహక ప్రాంతం నుండి వచ్చిన వర్షపు నీటితో సోమవారం సాయంత్రం నాటికి జూరాల ప్రాజెక్టులో 314.90 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది. జూరాలకు ఎగువ ప్రాంతం నుండి 6,365 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద జలకళ కన్పిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు, 9.657 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 3.789 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుండి సాగునీటి పథకాలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు.
జూరాలలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో పాటు వర్షపు నీరు చేరుతుండడంతో అన్నదాతలు ముందస్తు నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇదిలావుండగా, గత కొంతకాలంగా జూరాల ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ కాలువల్లో పూడికతీత మరమ్మతు పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినప్పటికీ కాలువలకు నీరు వదలడంతో పనులు పెండింగ్‌లో పడిపోయాయి. గతంలో మంజూరు చేసిన నిధులతో పాటు ఈ ఏడాది కూడా కాలువల మరమ్మతులు పూడికతీతకు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిజెపి అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై వరదల సమయంలో, కాలువలకు నీరు వదిలే సమయంలో పనులు చేపట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే కుట్రలు చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు.

చిత్రం.. వర్షపు నీటి చేరికతో కళకళలాడుతున్న జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్