తెలంగాణ

భూదాన భూముల అన్యాక్రాంతంపై సిబిఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: తెలంగాణలో అన్యాక్రాంతమైన భూదాన భూములపై సిబిఐ విచారణ జరిపించాలని సర్వే సేవా సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. ప్రభుత్వం వెంటనే భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేయాలని సర్వ సేవా సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షుడు వి. అరవింద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్ నాయక్ మంగళవారం విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2015 సంవత్సరం మే 13న జారీ చేసిన జివో నెంబర్ 59లో స్పష్టంగా భూదాన బోర్డు భూములు కబ్జా కావడాన్ని, తప్పుడు పత్రాలతో బోర్డు ఏర్పాటు కావడం గురించి పేర్కొన్నదని వారు గుర్తు చేశారు. కాబట్టి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచి ఇవ్వాలని వారు కోరారు. ఆనాడు ఆచార్య వినోబాభావే మంచి ఉద్దేశ్యంతో ఇచ్చిన పిలుపు మేరకు అనేక మంది భూములు దానం చేశారని, అలాంటి భూములు పేదలకు ఎందుకు పంచి ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. తెలంగాణలో 2,58,119 ఎకరాల భూదాన భూమి ఉండగా ఇంత వరకు కనీసం లక్ష ఎకరాలు కూడా పంపిణీ చేయలేదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలోనే ఇంత వరకు 1400 ఎకరాల భూమి కబ్జాకు గురైందని అరవింద్ రెడ్డి, శంకర్ నాయక్, షేక్ హుస్సేన్ తెలిపారు.