తెలంగాణ

ఎస్‌ఎల్‌బిసి సమావేశం నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: వ్యవసాయంతో పాటు వివిధ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా 2017-18 సంవత్సరానికి లక్ష్యాలను నిర్ణయించేందుకు వీలుగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటి (ఎస్‌ఎల్‌బిసి) సమావేశం శుక్రవారం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయానికి ఇవ్వాల్సిన రుణాలపై చర్చిస్తారు. రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, పి. శ్రీనివాసరెడ్డి తదితర మంత్రులతో పాటు వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, సహకార, గ్రామీణ బ్యాంకుల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని తమతమ బ్యాంకుల తరఫున వివరాలు అందిస్తారు. 2017-18 సంవత్సరానికి సేద్యం రంగానికి 45 వేల కోట్ల నుండి 50 వేల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు వీలుగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రాధాన్యతా రంగాలతో పాటు ప్రాధానే్యతర రంగాలకు ఇచ్చే రుణాలపై కూడా ఈ సందర్భంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వం వివిధ రంగాలకు ఇచ్చే సబ్సిడీ వివరాలు వెల్లడవుతాయి. బ్యాంకర్లు చర్చించి లక్ష్యాలను నిర్ణయించుకుంటారు. ఐదు నుండి ఆరు గంటల పాటు ఎస్‌ఎల్‌బిసి సమావేశం జరుగుతుంది.
ఈ సమావేశం ఇప్పటికే జరగాల్సి ఉంది. ఖరీఫ్ (వానాకాలం) ప్రారంభానికి ముందే ఎస్‌ఎల్‌బిసి సమావేశం జరిగి రుణాల పంపిణీ లక్ష్యాలను నిర్ణయిస్తే, ఇప్పటికే వ్యవసాయానికి రుణాల పంపిణీ ప్రారంభమయ్యేదని నిపుణులు భావిస్తున్నారు. ఖరీఫ్ రుణాలు సాధారణంగా ఆగస్టు చివరి వరకు కొనసాగుతూనే ఉంటాయి.
ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని చేపట్టిన తర్వాత నాలుగు దశల్లో దాదాపు 16 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమచేశారు. నాలుగోవిడత రుణమాఫీకి సంబంధించి నాలుగువేల కోట్ల రూపాయలను ఇటీవలే ప్రభుత్వం విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బు రైతులకు చేరడంలో కొన్ని చోట్ల జాప్యం జరుగింది. ఎస్‌ఎల్‌బిసి సమావేశం తర్వాత బ్యాంకర్లు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలుస్తోంది.