తెలంగాణ

జూరాలకు వరద నీటి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 22: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత పది రోజులుగా వస్తున్న వరద నీరు రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఎగువ ప్రాంతం నుండి జూరాల ప్రాజెక్టుకు 9,010 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో 316.440 మీటర్ల స్థాయిలో 5.852 టిఎంసిల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు, 9.657 టిఎంసిలు రావలసి ఉంది. అదే విధంగా ప్రాజెక్టు నుండి కోయిల్‌సాగర్‌కు 171 క్యూసెక్కుల నీరు, లీకేజీలు, ఆవిరి రూపంలో 182 క్యూసెక్కులు వెళ్తున్నట్టు జూరాల అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టిఎంసిలకు పైగా నీరు చేరుతుండడంతో జూరాల ఆయకట్టు, ఎత్తిపోతల పథకాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్లు, జూరాల కింద వరినాట్ల కోసం నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. గురువారం టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అం దించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించినట్టు తెలిపారు.
ర్యాలంపాడు, గుడ్డందొడ్డి లిఫ్ట్‌ల ద్వారా నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో నీటితో నింపేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

చిత్రం.. జలకళతో జూరాల రిజర్వాయర్