తెలంగాణ

బోరు బావిలో చిన్నారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, జూన్ 22: ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి బోరుబావిలోపడిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్లు పొలం దగ్గర ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల మండలానికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు కొన్నాళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం చన్‌వళ్లి గ్రామానికి వలస వచ్చారు. అక్కడే పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు హర్షిత, చిన్న కూతురు ఏడాదిన్నర వయసు ఉంది. పొలం దగ్గరే ఉన్న ఇంట్లోనే వీరు నివాసం ఉంటున్నారు. సాయంత్రం సమయంలో తల్లిదండ్రులు పొలం పనుల్లో ఉండగా అక్కా చెల్లెళ్లు అడుకుంటున్నారు. ప్రమాదవశాత్తు సంవత్సరంన్నర చిన్నారి అక్కడే ఉన్న బోరుబావిలో పడిపోయింది. దీంతో హర్షిత రోదిస్తూ వెళ్లి తండ్రికి విషయం చెప్పింది. చుట్టు పక్కల రైతుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. బోరుబావికి సమాంతరంగా జెసిబిలతో తవ్వకాలు ప్రారంభించారు. చిన్నారి సూమారు 45 అడుగుల లోతుకు పడిపోయి ఉంటుందని అనుమానిస్తూన్నారు. సింగిల్ ఫేజ్ బోరు వేసి నీళ్లు లేవని వదిలేయగా.. అందులో ప్రమాదవ శాత్తూ చిన్నారి పడిపోయింది.

బోరుబావిలో పడిన చిన్నారి హర్షిత (ఫైల్‌ఫొటో)