తెలంగాణ

‘కెకె’ భూములు వెనక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: మియాపూర్ భూముల కుంభకోణంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం సదరు భూముల క్రయ విక్రయాలను రద్దు చేసి తిరిగి భూములను స్వాధీనం చేసుకునే పనిలో తెరాస ప్రభుత్వం పడింది. అందులో భాగంగానే గోల్డ్‌స్టోన్ యాజమాన్యంనుండి కొనుగోలు చేసిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుటుంబ సభ్యుల భూమి రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసిన ప్రభుత్వం సదరు భూములను స్వాధీనం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం హఫీజ్‌పూర్‌లోని కెకె కుటుంబానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన జిల్లా యంత్రాంగం సుమారు 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. దీనిలో సుమారు 36 ఎకరాల అటవీ భూములుండగా మిగిలిన భూమి ప్రభుత్వానిదని అధికారులు చెబుతున్నారు. ఈ భూములతోపాటు గోల్డ్‌స్టోన్ యాజమాన్యం ఇతర అనుబంధ సంస్థలపేరుమీద రిజిస్ట్రేషన్ చేసిన 20 ఎకరాల భూమిని సైతం స్వాధీనం చేసుకుని సదరు రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది.
హఫీజ్‌పూర్‌లో సుమారు 2,244 ఎకరాల భూమి ఉండగా దానిలో 422 ఎకరాలు అటవీ శాఖకు కేటాయించిన ప్రభుత్వం 1965లో మిగిలిన భూమిని కొంతమంది రైతులకు లావునీ పట్టాలు పంపిణీ చేసారు. ఈ భూమి తమదని గోల్డ్‌స్టోన్ సంస్థ యజమాని కె.నవజ్యోతి గోల్డ్‌స్టోన్ ద్వారా కేశవరావుకుమార్తె గద్వాల విజయలక్ష్మి, కోడలు జ్యోత్స్నలు సుమారు 50 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ లావాదేవీలను ప్రభుత్వం రద్దు చేసి సదరు భూమిని స్వాధీనం చేసుకుంది.
20 కోట్ల విలువైన భూమి స్వాధీనం
మియాపూర్ భూ కుంభకోణంతో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని భావించిన జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావడంతో కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్ భూములను కాజేసేందుకు కబ్జాదారులు పూనుకున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీనితో ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల గ్రామంలోని సర్వే నంబర్ 79/2లోని ఐదు ఎకరాల లావుని భూములు అన్యాక్రాంతం అవుతున్నట్టు గుర్తించి పిఓటి చట్టం ద్వారా వెనక్కి తీసుకుని ఆక్రమణదారులనుండి కాపాడుకున్నారు. స్వాధీనం చేసుకున్న సదరు భూముల్లో ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేసారు. ఈ మండలంలో సుమారు మరో 25 ఎకరాల భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నట్టు గుర్తించిన రెవిన్యూ యంత్రాంగం త్వరలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తుండగా అధికార పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు అధికారులను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసినట్టు తెలుస్తోంది. సదరు భూమి ఆదిభట్లలోని టిసిఎస్ సంస్థ స్థలానికి దగ్గరగా వుండడంతో విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నిన కొంతమంది కబ్జాదారులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికారులు తీసుకునే కార్యక్రమాలకు అడ్డుపడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో భూ కుంభకోణాలపై అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా అధికారులపై మాత్రం ఒత్తిళ్లు తగ్గడంలేదని తెలుస్తోంది.