తెలంగాణ

హైదరాబాద్‌లో పట్టుబడ్డ పాత కరెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: హైదరాబాద్‌లో భారీగా రద్దయిన పాత నోట్లు పట్టుబడ్డాయి. భారత ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో రూ. 1000, రూ. 500 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నోట్లు మార్పిడీకి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిశాక అప్పుడప్పుడు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం సుమారు రూ. 7కోట్ల పాత కరెన్సీని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని ఓ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంలో పెద్దమొత్తంలో రద్దయిన పాత నోట్లు ఉన్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసుల అదుపులోని ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు శ్రీనివాస్ సినీ నటి జీవితకు సమీప బంధువు అని తెలిసింది. ఈ నోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎందుకు కార్యాలయంలో పెట్టారు? వంటి విషయాలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇలా ఉండగా, పాత నోట్ల మార్పిడీ కేసులో అరెస్టయిన శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి జీవిత స్పష్టం చేశారు. తన వద్ద పనిచేస్తున్న మేనేజర్లలో శ్రీనివాస్ కూడా ఒకరు..అంతే తప్ప అతడితో, పాత నోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. తన సోదరుడి పేరు మురళీ శ్రీనివాస్ అని, అనారోగ్యంతో బాధపడుతున్న అతను ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె చెప్పారు.