తెలంగాణ

బ్రాహ్మణులకు కుల ధ్రువీకరణ పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: బ్రాహ్మణ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం జివో జారీ చేసింది. ఇప్పటి వరకు రిజర్వేషన్ల సౌకర్యం ఉన్న కులాలకు మాత్రమే తాహసిల్దారు కార్యాలయంలో కుల దృవీకరణ పత్రం ఇచ్చే వాళ్లు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సరస్వతి విద్యా ప్రశస్తి, వివేకానంత విదేశీ విద్యా పథకాలకు కుల దృవీకరణ పత్రం అవసరం ఏర్పడింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వీటికి కుల దృవీకరణ పత్రం అవసరం ఏర్పడినందున దీనిని దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మాణులకు తహసిల్దారు కుల దృవీకరణ పత్రం ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పరిషత్ ప్రభుత్వాన్ని కోరింది.