తెలంగాణ

భువనగిరిలోనూ సరోగసి దందా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 23: సంతాన సాఫల్య కేంద్రం ముసుగులో పేద కుటుంబాల మహిళలకు డబ్బు ఎరచూపి నిబంధనలకు విరుద్ధంగా సరోగసి(అద్దెగర్భం) దందా సాగిస్తున్న మరో ఆసుపత్రి నిర్వాకం అధికారుల దాడుల్లో బట్టబయలైంది. భువనగిరిలోని నవ్యనర్సింగ్‌హోం, పద్మజ సంతాన సాఫల్య కేంద్రంలో సోమవారం డిఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీవో భూపాల్‌రెడ్డిల బృందం నిర్వహించిన దాడుల్లో 125మంది సరోగసి మహిళలను అధికారులు గుర్తించారు. వారిలో 87మంది గర్భిణులు కాగా, మిగతా వారు గర్భం దాల్చే క్రమంలో చికిత్సలు పొందుతున్నారు. ఆసుపత్రి భవనంతో పాటు పక్కనే ఉన్న మరో మూడు అద్దె భవనాల్లో ఉంచిన సరోగసి మహిళలను గుర్తించిన అధికారులు ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ సరోగసి దందా వెలుగు చూడటంతో అవాక్కయ్యారు. సరోగసి మహిళలకు సంబంధించిన ఒప్పందాలు, ఆసుపత్రి రికార్డులను అధికారుల స్వాధీనం చేసుకుని విచారణ సాగిస్తున్నారు. నవ్యనర్సింగ్‌హోం, పద్మజ సంతానసాఫల్యకేంద్రం సరోగసి వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. గతంలో సంతాన సాఫల్య కేంద్రానికి అనుమతి ఉందని, అయితే సరోగసి వాణిజ్యానికి ఇక్కడ అనుమతి లేదన్నారు.
కొనే్నళ్ల నుంచే సరోగసి
నిర్వహిస్తున్నాం : దివాకర్‌రెడ్డి
తాము సరోగసిని గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వాహకుడు మద్ది దివాకర్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించారు. అధికారుల దాడుల సమయంలో ఆయన భార్య డాక్టర్ పద్మజ అందుబాటులో లేరు. తాము సరోగసి మహిళలు, పిల్లలను తీసుకునేవారికి, ఆసుపత్రికి మధ్య నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకునే సరోగసి నిర్వహిస్తున్నామన్నారు.