తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అవసరం అయిన విద్యుత్‌పై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలోని సబ్ స్టేషన్లు, విద్యుత్ వనరులు, హెచ్‌టి విద్యుత్ లైన్ల నిర్మాణానికి సంబంధించి తొలిసారి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జెన్‌కో, ఇగరేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కాళేశ్వరం అపాజెక్టు నిర్మాణం త్వరితగతిన, షెడ్యూల్ కన్నా ముందే పూర్తి చేసేందుకు విద్యుత్ సంస్థల సహకారం, తోడ్పాటు అవసరమని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన విద్యుత్ సంబంధిత పనులను ప్యాకేజీల వారిగా సమీక్షించారు. 2018 మార్చి లోగా పది సబ్ స్టేషన్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మరో తొమ్మిది నెలల్లో సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయడానికి సంబంధించిన లక్ష్యాలు, నెల వారీ కార్యాచరణ ప్రణాళిక తెలియజేయాలని సంబంధిత ఏజెన్సీలను మంత్రి కోరారు. ఇకపై ప్రతి నెలా ఆయా పనుల పురోగతిని తాను సమీక్షిస్తానని చెప్పారు. ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు, రెండు 220 సబ్ స్టేషన్లు, రెండు 132 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయానికి పంపు చేసే పథకంలో ఒక 220కెవి, రెండు 132 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం చేయాల్సి ఉందని , వీటిని జూన్ 2018 నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విద్యుత్ అధికారులకు చెప్పారు. వరద కాలువ పథకంలో భాగమైన గౌరవెల్లి రిజర్వాయర్ వద్ద 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని డిసెంబర్ 2017 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ నదిపై నిర్మిస్తున్న చనక కొరాట పంప్ హౌజ్ వద్ద 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని మార్చి 2018 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెలాఖరులో కాళేశ్వరం ప్రాజెక్టులో యెల్లంపల్లి మిడ్‌మానేరు జలాశయాలను కలిపే లింకు ప్యాకేజీలను క్షేత్ర స్థాయిలో చూసి సమీక్షించనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి ప్యాకేజీ ఆరు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించి డెడ్‌లైన్లను ఖరారు చేశార. వచ్చే సెప్టెంబర్ నాటికి పంపు హౌజ్‌ల సివిల్ వర్క్ పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుల తయారీకి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.

చిత్రం.. అధికారులతో సమావేశమైన మంత్రి హరీశ్ రావు