తెలంగాణ

ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు కోసం కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఏకీకృత సర్వీసు గెజిట్ రాగానే దీనికి సంబంధించిన కార్యాచరణ చేపడతామని, ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, దీని కోసం ఉపాధ్యాయ సంఘాలతో త్వరలోనే సమావేశం నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు త్వరలోనే శ్రీకారం చుడతాం, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోనుల్లో మాట్లాడరాదని ఆదేశిస్తూ 2013లోనే సర్క్యూలర్ జారీ అయందని, ప్రస్తుతం ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఏకీకృత సర్వీసు నిబంధనలు గత 20 ఏళ్లుగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో పదోన్నతులు ఆగిపోయ, పాఠశాలల నిర్వహణ కొంత ఇబ్బందిగా మారిందన్నారు.
అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడు నిబంధనలకు ఆమోదం లభించడంతో పదన్నోతలు వస్తాయని తెలిపారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లు అన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలు అన్నీ భర్తీ చేయాలని నిర్ణయించడంతో త్వరలోనే నోటిఫికేషన్లు కూడా వస్తాయని చెప్పారు. పాఠశాలల్లో వౌలిక వసతులు మెరుగు పడుతున్నాయని, దీని కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల విశ్వాసం పెంచే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్‌లో చదివిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఐదువేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. గురుకులాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లో చేర్పిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా ఉపాధ్యాయుల నియామకాలు జరుపుతున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాధ్యాయులు, ప్రభుత్వం ముగ్గురూ సమిష్టిగా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవలసిన బాధ్యత ఉందని అన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ నిబంధనలకు రాష్టప్రతి ఆమోద ముద్ర పడడంతో రెండు దశాబ్దాల సమస్యకు ముగింపు లభించిందని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్ల ఎమ్మెల్సీలు కడియం శ్రీహరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం తెలంగాణ డిమాండ్ మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడులను కలిసి ఆమోదం కోసం ప్రయత్నించినట్టు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, యుటిఎఫ్, టిఎస్ యుటిఎఫ్, తెలంగాణ పిఆర్‌టియు, టిటిఎప్, తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌లు కడియం శ్రీహరిని కలిసిన వారిలో ఉన్నారు.

చిత్రం.. మంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్ల ఎమ్మెల్సీలు