తెలంగాణ

సిఎం కెసిఆర్, గవర్నర్ రంజాన్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ ప్రజలకు సిఎం కె.చంద్రశేఖరరావు, గవర్నర్ నరసింహన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను తీసుకు వస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మత సామరస్యానికి, సర్వమత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంగా, గంగా జమునా తహజీబ్ సంస్కృతి ప్రతిఫలించేలా పండుగ చేసుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పేద ముస్లింలకు దుస్తులను పంపిణీ చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. సర్వ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలనే ఆ భగవంతుడి ఆదేశం మేరకు మనమంతా జీవిత కాలం క్రమశిక్షణతో విశ్వాస పాత్రులు గా కొనసాగాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇందుకు రంజాన్ మాసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలన్నారు.