తెలంగాణ

కోవింద్‌కు మద్దతుపై పునరాలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఎన్‌డిఏ ప్రతిపాదించిన రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇచ్చే విషయమై సిఎం కెసిఆర్ పునరాలోచించాలని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నాడిక్కడ గాంధీభవన్‌లో రంజాన్ పండుగ సందర్భంగా పేద మహిళలకు రంజాన్ రేషన్ కిట్లను ఉత్తమ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతోన్మాద భావాలు ఉన్న వ్యక్తి రాష్టప్రతి అయితే దేశం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. ఆయన రాష్టప్రతి అయితే మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని, మత సామరస్యానికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న కోవింద్‌కు మద్దతు ఇవ్వడం పట్ల మరోసారి కెసిఆర్ పునరాలోచించుకోవాలని సూచించారు. భారత రాష్టప్రతి పదవికి ప్రతిపక్షాలు బలపర్చిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తగిన అర్హత కలిగిన ఉత్తమ అభ్యర్థి అని ఉత్తమ్ పేర్కొన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపర్చేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్ సహకరించిన తీరు అద్భుతమని, అది గుర్తుంచుకునైనా సరే ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించాలని కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈద్ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రజలందరిలోనూ సుఖశాంతులను ప్రసాదిస్తుందని అన్నారు. ఈ రంజాన్ పండుగను పురస్కరించుకుని ఐదు కిలోల బియ్యం, కిలో పంచదార, ఒక లీటర్ పాలు, ఒక కిలో సేమ్యా, డ్రై ఫ్రూట్స్‌లతో కూడిన కిట్లను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభలో ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపి వి.హనుమంతరావు, ప్రభృతులు హాజరయ్యారు.
ఇందిర సేవలు చిరస్మరణీయం: రాజ్‌బబ్బర్
ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ సమగ్రత, సమైక్యతకు చేసిన సేవలు చిరస్మరణీయమని ఉత్తర్‌ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ పేర్కొన్నారు. ఆదివారం నాడిక్కడ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ శతజయంతిని పురస్కరించుకుని ఇందిర రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజబబ్బర్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన మంచి పనులు, జాతి కోసం చేసిన త్యాగాలను యువతకు తెలియజేయాలని అన్నారు.