తెలంగాణ

తెలంగాణకు భారీ వర్షసూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ, మధ్యభారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే మూడురోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం వల్ల నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయని, వచ్చే 48 గంటల్లో ఇవి గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయన్నారు. అల్పపీడనం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై బలమైన ప్రభావం చూపిస్తాయని వివరించారు. గత 24 గంటల్లో సత్తుపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది.