తెలంగాణ

దూరవిద్య దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా, యుజిసి ఎంత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా, యూనివర్శిటీలు మాత్రం ఇష్టారాజ్యంగా దూర విద్య కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. యుజిసి ఆధీనంలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతితోనే దూరవిద్య, సార్వత్రిక విద్యను అందించాల్సి ఉన్నా చాలా విశ్వవిద్యాలయాలు ఆయా కోర్సులకు సంబంధించి ఎలాంటి వౌలిక సదుపాయాలు లేకున్నా, యూనివర్శిటీల్లో ఆయా కోర్సులకు సంబంధించిన విభాగాలు లేకున్నా యధేచ్ఛగా తమ పని తాము కానిస్తున్నాయి. యుజి, పిజి, సర్ట్ఫికేట్, పిజి సర్ట్ఫికేట్ కోర్సులతో పాటు స్వల్ప వ్యవధి కోర్సులను దేశవ్యాప్తంగా 13 ఓపెన్ యూనివర్శిటీలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 16 సంప్రదాయ వర్శిటీలు, ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 50 ప్రైవేటు యూనివర్శిటీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రతి కోర్సునకూ యూనివర్శిటీ యుజిసి గుర్తింపు అనివార్యమైనా యూనివర్శిటీలు మాత్రం మసిపూసి మారేడు కాయ చేస్తున్నాయి.
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న చందంగా యూనివర్శిటీలు కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నాయి. ప్రతి యూనివర్శిటీ దూరవిద్య ద్వారా కోర్సులను ఆఫర్ చేసినపుడు ఇచ్చే సర్ట్ఫికేట్‌పై స్పష్టంగా దూర విద్య కోర్సు అని పేర్కొనాల్సి ఉన్నా కాకతీయ విశ్వవిద్యాలయం వంటి కొన్ని వర్శిటీలు ఆ ముచ్చట లేకుండానే సర్ట్ఫికేట్లు జారీ చేస్తున్నాయి. జర్నలిజం డిపార్టుమెంట్ లేకున్నా జర్నలిజంలో దూరవిద్య కోర్సును కాకతీయ యూనివర్శిటీ ఆఫర్ చేస్తూ డిగ్రీలను ఇచ్చేస్తోంది. ఇదే పరిస్థితి ఇటు తెలుగు యూనివర్శిటీలోనూ, అటు ఉస్మానియా యూనివర్శిటీలో కూడా ఉంది. ఆంధ్రా యూనివర్శిటీ, నాగార్జున వర్శిటీలు సైతం సొంత డిపార్టుమెంట్‌లు లేకుండానే విభిన్నమైన అంశాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దీనికి తోడు ఇతర రాష్ట్రాల యూనివర్శిటీలు గురించి చెప్పాలంటే ఇక లెక్కేలేదు. తమిళనాడుకు చెందిన పలు యూనివర్శిటీలు అభ్యర్ధుల అడ్మిషన్ సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రికార్డులను తయారుచేసుకుంటున్నాయి.
అభ్యర్ధి ఆధార్ నెంబర్,చిరునామా కూడా తీసుకునే తమిళనాడు యూనివర్శిటీలు పరీక్షలను నిర్వహించేందుకు స్థానికంగా ఒక దూరవిద్య కేంద్రాన్ని ఎంచుకుని అక్కడే పరీక్ష సెంటర్‌ను ఇస్తున్నాయి. కాని పరీక్ష ఆ సెంటర్‌లో జరగకుండా ఏ ఏ రాష్ట్రాల్లో అభ్యర్ధులున్నారో ఆయా రాష్ట్రాల్లోనే పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి యూనివర్శిటీల చేష్టలు అభ్యర్ధులకు కలిసి వస్తోంది. యూనివర్శిటీలు పేపర్ లీక్ నిరోధించడానికి అనే సాకుతో పరీక్ష పత్రాలను ఇ మెయిల్‌లో పంపిస్తున్నాయి. ఇ మెయిల్ పంపగానే పాస్‌వర్టులు సెల్‌ఫోన్‌ల్లో అందరికీ చేరుతున్నాయి. ఎక్కడి అభ్యర్ధులు అక్కడే దానిని డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు జరిగిన తర్వాత జవాబుపత్రాలను కొరియర్‌లో అసలు పరీక్ష కేంద్రాలకు చేరవేస్తున్నారు. అక్కడి నుండి యూనివర్శిటీకి వ్యక్తిగతంగా జవాబుపత్రాలను అందజేస్తున్నారు. ఇదంతా జరగడానికి వారం రోజులు పడుతోంది. అయితే అసలు కిటుకు ఇక్కడే ఉంది. యూనివర్శిటీ నిర్వహించిన పరీక్షల జవాబుపత్రాలను స్థానిక కేంద్రాలు వారం పది రోజుల తర్వాత ఎందుకు అందజేస్తున్నారనే ప్రశ్నను ఎవరూ వేయరు. అలా వేయకుండా సిబ్బందిని, యూనివర్శిటీ పెద్దలను స్టడీ సెంటర్ల అభ్యర్ధులు మేనేజ్ చేస్తున్నారు. దాంతో గుట్టుచప్పుడు కాకుండానే ఎవరి పని వారు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా కొన్ని కోర్సులకు ఎలాంటి విభాగాలు లేకున్నా దూర విద్యా కేంద్రం ద్వారా వాటిని ఆఫర్ చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.
కొత్త నిబంధనలు
యూనివర్శిటీలు ఇష్టారాజ్యంగా ఆఫర్ చేస్తున్న దూరవిద్య కోర్సులపై యుజిసి దృష్టిసారించింది. ప్రతి విశ్వవిద్యాలయం తాజాగా గుర్తింపు పొందాలని, కొత్త నిబంధనలను అనుసరించాల్సిందేనని ఆదేశించింది. దీనికోసం యుజిసి సార్వత్రిక- దూర విద్య నిబంధనలు -2017ను రూపొందించింది. దూర విద్య ద్వారా ఒక డిగ్రీ ఇవ్వాలంటే కనీస నిబంధనలను పాటించేలా యుజిసి వీటిని జారీ చేసింది. అలాగే స్వయం ప్లాట్‌ఫారంపై అభ్యసించిన వారికి కొన్ని క్రెడిట్‌లను కూడా జారీ చేస్తారు.