తెలంగాణ

దళిత అభ్యర్థిని ముందుగా ఎందుకు ప్రకటించలేదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, జూన్ 26: దళితుడిని రాష్టప్రతి అభ్యర్థిగా యుపిఎ ముందుగా ఎందుకు ప్రకటించలేదని, ఎలాగూ ఓడిపోతామన్న భయంతోనే ఎన్డీఎ తన అభ్యర్థిగా దళితుడిని ప్రకటించిన తరువాతే యుపిఎ దళిత అభ్యర్థిని ప్రకటించి విపక్షాలపై ఆరోపణలు చేస్తోందని మహబూబ్‌నగర్ ఎంపి జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగ ర్ జిల్లా నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి యుపిఎ ప్రకటించిన దళిత అభ్యర్థికి ఓట్లు వేయాలని, ప్రధాని మోదీకి భయపడి టిఆర్‌ఎస్ ఎన్డీఎ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. సిఎం కెసిఆర్‌తో సహా టిఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరికీ భయపడబోరన్నారు. ఎన్డీఎ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే సిఎం కెసిఆర్ తమ సంపూర్ణ మద్దతును ఎన్డీఎ అభ్యర్థికి ఇచ్చారని, అయితే యుపిఎ తరువాత నిర్ణయం తీసుకుని దళిత అభ్యర్థిని రంగంలోకి దింపి ఇష్టానుసారం మాట్లాడడం ఆయన స్థాయికి తగదని మాజీ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. 2019 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. యుపిఎ దాని అనుబంధ పార్టీలు అనవసర ఆరోపణలు మానుకోవాలని, ప్రజాసేవలో టిఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేలు అందరి కంటే ముందున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాగా, జిల్లాకు మంజూరైన సైనిక్ స్కూల్‌ను నారాయణపేటలో ఏర్పాటు చేయిస్తామని, జిల్లాల పునర్విభజన మరోమారు జరిగితే నారాయణపేటను ముందుగా జిల్లాగా ప్రకటింపజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నారాయణపేటకు శాశ్వత తాగు, సాగు నీటి ఎద్దడి నివారణకు జాయమ్మ చెరువు ఎత్తిపోతలకు సంబంధించి డిపిఆర్‌ను సిద్ధం చేశామని, దానికి సంబందించిన ఫైల్ ప్రభుత్వం వద్ద ఉందన్నారు.