తెలంగాణ

క్రిమిసంహారక మందు తాగి ఆర్టీసీ డిఎం ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ జూన్ 27: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిఎం కట్ట మహేందర్ (56) మంగళవారం తెల్లవారుజామున ఖేడ్ పట్టణంలో బైపాస్‌రోడ్డులోని పంచగామకు వెళ్లే దారిలో శవమై కనిపించారు. అయన పక్కనే పురుగుల మందు డబ్బు పడి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నరేందర్ ఉదయం 7 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న ఐడి కార్డును పరిశీలించి ఆర్టీసీ డిఎం గా గుర్తించారు. ఐడి కార్డులోని ఫోన్ నెంబర్లు ఆధారంగా వారి ఇంటికి సమాచారం అందించడంతో తాము వచ్చేవరకు అలస్యం అవుతుందని, శవాన్ని పంచనామా చేసి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయాలని వారి కుమారులు చెప్పడంతో పోలీసులు శవాన్ని పంచనామా నిర్వహించి ఆసుత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికులకు ఈ విషయం తెలియడంతో భారీగా ఆసుపత్రికి తరలివచ్చారు. మృతుడి ఇద్దరు కుమారులు కౌసిక్, కార్తీక్ మంగళవారం మూడు గంటలకు ఖేడ్‌కు వచ్చారు. ఆసుపత్రిలో తండ్రి మృతదేహాన్ని చూసిన అనంతరం కార్మికు లు, జిల్లా ఉన్న స్థాయి ఆర్టీసీ అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పెద్దకుమారుడు కౌసిక్ ఫిర్యాదు మేరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య కు చేసుకున్నారని, ఎవరిపైనా తమకు అనుమానం లేదని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్ విలేఖరులకు తెలిపారు. శవాన్ని పోస్టు మాస్టం చేయించి కుమారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఇదిలావుండగా మృతుడి చిన్న కుమారుడు కార్తీక్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తమ స్వగ్రామం కరీంనగర్ అని తెలిపారు. ఖేడ్‌కు డిఎంగా వచ్చిన తరువాత కొంత పని భారం పెరిగిందని తనతో చెబుతుండే వారని తెలిపారు. సోమవారం రాత్రి 7గంటలకు తనతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు. రోజూ డ్యూటీ నుంచి రూమ్‌కు వెళ్లిన తరువాత తనతో ఫోన్‌లో మాట్లాతుండేవారని చెప్పాడు. ఇది లావుండగా, తెలంగాణ ఆర్టీసీ యూనియన్ జిల్లా నాయకులు తమాఫ్, నెహ్రూ నాయక్, శాంతయ్య, కార్మిక నాయకులు కాశీరాం, స్వామిదాస్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఖేడ్‌లో మొదటిసారిగా ఆర్టీసీ ఉన్నతస్థాయి అధికారి ఆత్మహత్యకు పాల్పడడంతో కార్మికులు విచా రణ వ్యక్తం చేస్తున్నారు. ఖేడ్‌కు డిఎంగా వచ్చి నెల 15 రోజులైనా ఎలాంటి ఇబ్బందులకు కార్మికులకు గురిచేయలేదని కార్మికులు చెబుతున్నారు.