తెలంగాణ

పైపులైన్ పనులను అడ్డుకున్న గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, జూన్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం బ్యారేజీ పైపు లైన్ సర్వే పనులను మంగళవారం కాటారం మండలంలోని దామెరకుంట వాసులు అడ్డుకున్నారు. దామెరకుంట గ్రామ శివారు నుంచి సర్వే పనులు జరగుతుండగా ఆచార సాంప్రదాయాలకు విఘా తం కలుగుతుందని భావించిన ప్రజలు నిరసన తెలిపారు. శివారుకు ఆనుకొని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గల ఊడలమర్రి, అన్నపూర్ణ దేవాలయం ఉంది. గత దశాబ్దాల కాలం నాటి ఊడలమర్రి సర్వేలో భాగంగా కోల్పోవలసి వస్తుందని భావించిన గ్రామస్థులు సర్వే పనులను అడ్డుకున్నారు. హిందూ దేవాలయంలో అతి పురాతన ఆలయంగా భావిస్తున్న అన్నపూర్ణ దేవాలయం కూడా సర్వే పనులకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారని స్థానికు లు ఆందోళ న వ్యక్తం చేశారు. కాగా, సర్వే రూటును మార్చి పనులు చేపట్టాలని గ్రామస్థులు మూకుమ్మడిగా సర్వే పనులను అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా పనులను నిలిపివేసి అధికారులు వెనుదిరిగారు.
జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం దామెరకుంటలోని సర్వే పనులను పరిశీలించాలని, అన్నపూర్ణ దేవాలయాలకు ఇబ్బందులు లేకుండా సర్వే పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.