తెలంగాణ

గన్ లైసెన్సుకూ ఆధార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: రాష్ట్రంలో గన్‌లైసెన్స్‌కూ ఆధార్‌ను లింక్ చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇటీవల లైసెన్సు కలిగిన కొందరు తమ గన్‌ను అనవసరంగా గాల్లోకి కాల్పులు జరిపి దుర్వినియోగం చేసిన సంఘటనలు జరుగుతున్న దరిమిలా ఆధార్ ఆనుసంధానం అనేది అవసరమని భావిస్తున్నారు. ఎవరైతే గన్ లైసెన్స్ కలిగి ఉంటారో వారి ఆధార్ సమాచారాన్ని సమర్పించాలని కోరుతున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గన్ లైసెన్స్‌లన్నింటికీ ఆధార్‌ను లింక్ చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 8,600 గన్‌లైసెన్సులు ఉండగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 4,365 ఉన్నాయి. ఇంతేకాకుండా ప్రయోగాత్మకంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఆయుధ లైసెన్సు దారులందరి నివాసాలకు జియోట్యాగింగ్ చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసు విభాగం నిర్ణయించింది. జియోట్యాగింగ్ అనేది పూర్తిగా పోలీసు శాఖ అంతర్గత అవసరాలకు తప్ప సాధారణ ప్రజలకు ఏమాత్రం సంబంధం ఉండదు. లైసెన్సు గురించి అవసరమైన సమయాల్లో సంబంధిత ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేసేందుకు వీలుగా జియో ట్యాగింగ్ అనేది చేపడుతున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను కూడా పోలీసు శాఖ సిద్ధం చేసింది. గన్‌లైసెన్సు కలిగిన వారందరి ఆధార్ నెంబర్లను సంబంధింత పోలీసు స్టేషన్ పరిధిలోని కానిస్టేబుళ్లే నేరుగా వారి నివాసాలకు వెళ్లి సేకరిస్తున్నారు. గన్ లైసెన్సులకు ఆధార్ లింక్ చేయడమనే ప్రక్రియ కొనసాగుతోంది తప్ప ఆధార్ కోసం పోలీసు శాఖ లైసెన్సు దారులపై ఒత్తిడి తీసుకు రావడం లేదు.