తెలంగాణ

ఆరు నెలల్లో పాదచారుల క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: మహానగర పాలక సంస్థలోని కొందరు ఇంజనీర్ల నిర్వాకం కారణంగా ముప్పై ఏళ్లుగా కొన‘సాగు’తున్న చార్మినార్ పాదచారుల క్షేత్రం పనులను రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు శుక్రవారం పరిశీలించారు. రెండురోజుల క్రితం వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసి సభలో చేసిన అభ్యర్థన మేరకు మంత్రి శుక్రవారం చార్మినార్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. చార్మినార్ పాదచారుల క్షేత్ర పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం, సరైన సమీక్ష లేకపోవటం వల్లే నగరానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు సాగక, మూలనపడ్డాయని వ్యాఖ్యానించారు. ఇపుడు చార్మినార్ పాదచారుల క్షేత్రం ప్రాజెక్టుకు అవసరమైతే అదనంగా నిధులను మంజూరు చేయటంతో పాటు పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ ఆరు నెలల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక, చారిత్రక కట్టడమైన చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు, చార్మినార్ కట్టడాన్ని శబ్ద, వాయు కాలుష్యంతో పరిరక్షించుకునేందుకు ఆయా పరిసర ప్రాంతాల్లో బ్యాటరీ ఆటోలను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ బ్యాటరీ ఆటోలు పర్యాటకులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. చార్మినార్ సమీపంలోని సర్దార్ మహల్‌లోని జిహెచ్‌ఎంసి జోనల్ కార్యాలయాన్ని తరలించి, చాంద్రాయణగుట్టలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. చారిత్రక కట్టడమైన సర్దార్ మహల్‌ను కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఫుడ్ కోర్టు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చార్మినార్ ఎదురుగా ఉన్న లాడ్‌బజార్ ప్రాంతాలను పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించి, భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు గాను చుట్టూ నిర్మించిన ఔటర్ రింగురోడ్డు, ఇన్నర్ రింగురోడ్డులను మరింత విస్తరిస్తామని తెలిపారు. అనంతరం చార్మినార్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ పాదయాత్ర నిర్వహించి పలు సమస్యలను అడిగి తెల్సుకున్నారు. కొన్నింటికి సంబంధించి పరిష్కరించాలని అప్పటికపుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్శనలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌లతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఇంజనీర్లున్నారు.

చిత్రం చార్మినార్‌వద్ద పాదచారుల క్షేత్రం ప్రాజెక్టును పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్