తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికి అందరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు కెసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై చేస్తున్న చిల్లర రాజకీయాలను మానుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కెసీఆర్ నిర్దిష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయన్నారు.
ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజల గొంతును విన్పించే వేదికపై సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ఆహ్వానిస్తే కాంగ్రెస్ రాలేదన్నారు. 2000 సంవత్సరంలో వారు అధికారంలో ఉన్నపుడు డిజైన్ చేసిన ప్రాజెక్టులతో సెంటు భూమికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. అటువంటి ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కెసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దీనికి మోకాలడ్డడం విపక్ష నేతల అవివేకానికి నిదర్శనం అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా తిరుమలాయపాలెంలో కరవును జయిస్తామన్నారు. ఈ ప్రాజెక్టును నాలుగు నెలల్లోనే వినియోగంలోకి తెస్తామని ప్రకటించారు. గోదావరి, కృష్ణా జలాలతో రాష్ట్రానికి సాగునీరు అందుబాటులోకి తెస్తామన్నారు. భద్రాచలం నుంచి ఆంధ్రాలో కలిసిన 5 పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. భద్రాచలం శాశ్వత అభివృద్ధి, 5 పంచాయితీల విలీనం, రామాలయం అభివృద్ధికి కార్యచరణను రూపొందించేందుకు 4వ తేదీన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు నలువైపులా జాతీయరహదారులు వస్తున్నాయని, త్వరలో ఖమ్మం ముఖ్యకేంద్రం అవుతుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.