తెలంగాణ

కెసిఆర్ ప్రజెంటేషన్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఏప్రిల్ 2: సిఎం కెసిఆర్ ప్రాజెక్టులపై శాసనసభలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అద్భుతమని దేశ చరిత్రలో తొలిసారిగా ఒక సిఎం ఇంత అవగాహనతో ప్రాజెక్టులపై వివరించడం అభినందనీయమని కాంగ్రెస్ శాసన సభ పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను టివిలో తాను ఆద్యంతం ఆసక్తిగా చూశానని ప్రాజెక్టులపై ఆయన మాట్లాడిన తీరు తనను ఆకట్టుకుందన్నారు. పార్టీలకు అతీతంగా కెసిఆర్ ప్రజెంటేషన్‌ను అంతా స్వాగతించారని అయితే మాటలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని తాను కోరుతున్నానన్నారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎల్‌బిసి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తిలను పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీటి భాగ్యం లభిస్తుందన్నారు. అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై రీ ఇంజనీరింగ్ చేయడంలో తప్పు లేదంటు సిఎం కెసిఆర్ తీరును సమర్ధించారు. కాంగ్రెస్ నాయకులు కొందరు తమ్మిడిహట్టి డిజైన్ ప్రస్తావన సందర్భంగా తాము ప్రిపేర్‌డ్‌గా రాలేదంటు మాట్లాడటం విడ్డూరమంటు పరోక్షంగా పిసిసి చీఫ్ ఉత్తమ్‌కు చురకలంటించారు. పార్టీలో బాధ్యత గల హోదాలో ఉన్నప్పుడు అన్నింటిపై అవగాహన అవసరమన్నారు. సిఎం కెసిఆర్ ప్రజెంటేషన్‌లో ఎస్‌ఎల్‌బిసిని మూడేళ్లలో, ఉదయ సముద్రంను ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రకటించడటం సంతోషంగా ఉందన్నారు. శాసనసభలో తాను జిల్లా ప్రాజెక్టులు, కరవు సమస్యలను ప్రస్తావించగా సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, పోచారంలు సానుకూలంగా స్పందించారన్నారు. రాజకీయాలు ఎన్నికల్లో మాట్లాడుతానని రైతుల కోసం, ప్రాజెక్టుల పూర్తి కోసం తన పోరాటం శాసన సభ లోపల, బయట కొనసాగుతుందన్నారు. ఊరికి యభై డబుల్ బెడ్‌రూంలు, హైద్రాబాద్‌లో లక్ష ఇళ్లు కడితే వచ్చే ఎన్నికల్లో కెసిఆర్‌నే గెలిపించాలని చెబుతానన్నారు. ఎఎమ్మార్పీ మెయిన్ కెనాల్ లైనింగ్‌కు 400కోట్లతో త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి హరీష్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా మంచినీటి పథకాల మోటార్ల మార్పు చేయాలని కోరగా అందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. జూన్‌లో వరద కాలువ ట్రయల్ రన్ నిర్వహిస్తారన్నారు. నల్లగొండలో నూతన వ్యవసాయ మార్కెట్, బత్తాయి మార్కెట్ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.