తెలంగాణ

అన్నదాతల ఆశలు ఫలించిన వేళ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 2: తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల పాటు కరెంటు సరఫరా చేయడానికి నిర్ణయించింది. మార్చి నెలాఖరు నుంచి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ట్రాన్స్‌కో అధికారులు ఏప్రిల్ 1వ తేదీ నుండి వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. పగటి పూటనే ఇస్తామన్న మాటకు కట్టుబడకపోయినా మండుతున్న ఎండల బారినుంచి పంటలను పరిరక్షించుకునే వెసులుబాటు లభించిందన్న సంతృప్తి రైతుల్లో కనిపిస్తోంది. పగటి పూట 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని ట్రాన్స్‌కో ఎస్‌ఇ సదాశివరెడ్డి స్పష్టం చేసారు. వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు ఎండిపోగా, భూగర్భ జలమట్టం సైతం గణనీయంగా పడిపోయింది. కాస్తోకూస్తో నీటిని అందిస్తున్న బోర్ల ద్వారా పంటలను సాగు చేస్తున్న రైతులకు కరెంటు సరఫరా సరిపోను లేకపోవడంతో ఎండిపోతున్న పంటలను చూసి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంటలకు ఊరట, రైతులకు బాసట కల్పిస్తోందని చెప్పవచ్చు.
జిల్లాలో వ్యవసాయం, గృహావసరాలు, వాణిజ్యం, పరిశ్రమలకు 15 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఇందులో వ్యవసాయ రంగానికే 6 మిలియన్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. పగటి పూట 6 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను చేస్తున్నట్లు ఎస్‌ఈ వెల్లడించారు. జిల్లాలో నీటి కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో పగటి పూట వ్యవసాయానికి ఆరు గంటల విద్యుత్ సరఫరా వల్ల వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకునే వారితో పాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే వారికి కరెంటు సరఫరా ప్రత్యక్ష మద్దతు పలుకుతుందని చెప్పవచ్చు. జిల్లాలోని ఆయా మండలాల్లో విస్తరించిన సౌరశక్తి విద్యుత్ కేంద్రాలతో ట్రాన్స్‌కోకు ఉపశమనం కల్పిస్తోంది. ఆయా ప్రాంతాల్లోని సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. 40 కేంద్రాల నిర్మాణం కొనసాగుతుండగా 11 కేంద్రాలతో 150 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుండగా అన్ని కేంద్రాల నిర్మాణాలు పూర్తయితే 24 గంటల పాటు విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందించినా ఆశ్చర్యపోనక్కర లేదు. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు కరెంటు తిప్పలు తొలగిపోయి మంచి భవిషత్తు సిద్ధిస్తుందని చెప్పవచ్చు. పారిశ్రామిక జిల్లాగా గుర్తింపు పొందిన మెదక్‌లోని ఆయా ప్రాంతాల్లో వందలాదిగా పరిశ్రమలు విస్తరించాయి.
జిల్లాలో పనిచేస్తున్న ట్రాన్స్‌కో డిఇలు, ఎఇలకు, సబ్ స్టేషన్ల నిర్వాహకులకు ఆదేశాలను జారీ చేసారు. అప్పటికప్పుడు అమలు చేయడానికిగాను సెల్‌ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపించి 9 గంటల విద్యుత్ సరఫరాను అమలులోకి తీసుకురావడం రైతులకు శుభసూచకమే. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరాలో మరో మైలురాయిని దాటిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.