తెలంగాణ

డ్రగ్స్ అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మంగళవారం ఆలిండియా రేడియో, ఎఫ్‌ఎం రెయిన్‌బోలో ‘మాదక ద్రవ్యాలు-నివారణకు చర్యలు’పై పలువురి సలహాలు, సందేహాలకు వారు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో డ్రగ్స్ దందా ఎప్పటి నుంచో ఉంది..కానీ ఇప్పుడు తీవ్రం కావడంతో డ్రగ్స్ నివారణకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది..ప్రభుత్వం కూడా మాదకద్రవ్యాల మాఫియాపై సీరియస్‌గా తీసుకుంది..ఈమేరకు మాదకద్రవ్యాల కేసును తీవ్రంగానే పరిగణిస్తున్నామని వారు స్పష్టం చేశారు.
డ్రగ్స్ కేసులో ప్రచారమాధ్యమాలలో వస్తున్న కథనాలు, ఒక వర్గానికి చెందిన వారినే టార్గెట్ చేస్తూ ఉండడం మంచిది కాదన్నారు. డ్రగ్స్ వాడకం అన్ని వర్గాల ప్రజల్లో ఉందని, ఈ కేసులో దోషులెవరైనా కఠినంగా వ్యవహరిస్తామని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు డ్రగ్స్ ఎవరు పంపిస్తున్నారు.. ఎక్కడి నుంచి వస్తున్నాయి..ఎవరెవరు సరఫరా చేస్తున్నారు..ఎవరికి సరఫరా అవుతుంది అనే కోణం నుంచి దర్యాప్తు కొనసాగతుందని, డ్రగ్స్‌కు బానిసలైన వారు మానుకోవాలని వారు సూచించారు. డ్రగ్స్ అరికట్టడంలో ప్రజల బాధ్యత కూడా ఉందని, ఎవరైనా డ్రగ్స్ కొంటున్నా..విక్రయిస్తున్న వారు కనబడితే టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. డ్రగ్స్ అరికట్టడంతలో మీరే ఒక పోలీస్..మీరే ఒక నిఘా.. అని కూడా వారు పేర్కొన్నారు.
స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు డ్రగ్స్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులపై నిఘా పెట్టాలని సూచించినట్టు వారు తెలిపారు. గంజాయి కూడా బాగానే పట్టుబడుతుందని, రైతులు అంతర్‌పంటగా గంజాయి సాగుచేస్తున్నారని వారు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా గంజాయి సాగును మానుకోవాలని సూచించారు.
బాధితుల పునరావాస కేంద్రం, పాఠశాలల్లో అవగాహన కల్పించడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటి చర్యలు చేపట్టబోతున్నామని వారు తెలిపారు. డ్రగ్స్‌పై అవగాహనకు మించి పరిష్కారమేది లేదన్నారు. కౌనె్సలర్ దేవిక మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో నయాసేవరా..రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే మరిన్ని కేంద్రాలు స్థాపించి సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.