తెలంగాణ

కలెక్టర్ల ఆటవిడుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 17: బోనాల పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా ఆమ్రపాలి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం గుట్టలో ఆటవిడుపు చేసారు. సోమవారం జిల్లాలో ఒకవైపు ముసురు పడుతుండగా ఇద్దరు మహిళా కలెక్టర్లు కాలినడకన దాదాపు 12 కిలోమీటర్ల మేర గుట్టల్లో ప్రయాణించారు. గుట్టలపై ఉన్న ప్రకృతి అందాలను తిలకించి పులకించిపోయారు. బయ్యారం ఇనుప గనులు ఉండే పెద్ద గుట్ట ఎక్కుతూ అందాలను ఆస్వాదించారు. హరితహారం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా మధ్య జరిగిన సంఘటన నేపథ్యంలో కలెక్టర్ తీవ్ర అసహనానికి, మనస్తాపానికి లోనయ్యారు. అందులో నుండి తేరుకునేందుకు ప్రీతిమీనా దంపతులతో పాటు ఆమె స్నేహితురాలైన వరంగల్ అర్బన్ కలెక్టర్ కాటా ఆమ్రపాలితో కలిసి బయ్యారం గుట్టల అందాలను తిలకించి కాసేపు అడవిలో సేదతీరారు. అనంతరం ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అలుగుపారుతున్న బయ్యారం పెద్ద చెరువును తిలకించారు.

చిత్రం.. బయ్యారం గుట్టల్లో కలెక్టర్లు ప్రీతిమీనా దంపతులు, ఆమ్రపాలి