తెలంగాణ

పాలమూరు ముంపు బాధితులను మోసగిస్తున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 21: పాలమూ రు ఎత్తిపోతల పథకం ముంపు బాధితులను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల పథ కం పరిధిలో గల నార్లపూర్, ఎదుల, కర్వె న, వట్టెం రిజర్వాయర్ పనులను సిపిఐ రాష్ట్ర బృందం శుక్రవారం పరిశీలించింది. వివిధ రిజర్వాయర్ల పనులను పరిశీలించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ముంపు బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు నేరవేరాయని నిర్వాసితులను సిపిఐ బృందం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలో గల కర్వెన రిజర్వాయర్ పనులను పరిశీలించా రు. భట్టుపల్లి, భట్టుపల్లితాండ, కర్వెన గ్రామస్థులతో చాడ వెంకట్‌రెడ్డి ముఖాముఖిగా భేటి అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంపై ఆరా తీశారు. ముంపు బాధితు లు తమను ప్రభుత్వం మోసం చేసిందని ముఖ్యమంత్రి కెసిఆర్ తమకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండానే అధికారులు తమను ప్రలోబాలకు గురిచేసి, బేదిరింపుల కు దిగి సంతకాలు చేయించుకుని భూము లు తీసుకున్నారని పలువురు రైతులు సిపి ఐ నేతల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా భట్టుపల్లి గ్రా మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కర్వెన ప్రాజెక్టు ముంపు బాధితులను నిలువున ముంచుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని కర్వె న రిజర్వాయర్‌ను 2015 జూన్ 11వ తేదిన శంకుస్థాపన చేశారని తెలిపారు. అయితే శంకుస్థాపన సమయంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ భూత్పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో కర్వెన రిజర్వాయర్ ముంపు బాదితులకు బహిరంగంగా హామీ ఇచ్చారని ఆ హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చాకే కర్వెన రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇక్కడే గట్టుపై కూర్చోని రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇప్పిస్తానన్న హామీ ఎమైందని చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. భూములు, గ్రామాన్ని కొల్పోతున్న బాధితులకు 20 ఏళ్ల వరకు నెలకు ఒక్కొక్కరికి రూ.5వేల చోప్పున ప్రత్యేక పించన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే ప్రాజెక్టు పరిధిలోని ఉదండపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు రూ.7లక్షలకుపైగా ఎకరాకు ఎలా చెల్లిస్తున్నారని ఇక్కడ రూ.3. 50లక్షలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితులకు కెసిఆర్ ఇచ్చిన హామీలను నేరవేర్చేదాకా సిపిఐ పార్టీ తరపున భట్టుపల్లి గ్రామంలో ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని ముంపు బాధితులకు అండగా ఉంటామని నాలుగైదు రోజుల్లో తాము ఇక్కడే తిష్టవేసి ముఖ్యమంత్రి కళ్లు తెరిపించేవిధంగా కర్వె న రిజర్వాయర్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, ఈర్ల నరసిం హ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్ జిల్లా కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితులతో
మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి