తెలంగాణ

కాళేశ్వరం పనుల్లో ముందడుగు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 23: ఫ్లోరైడ్, కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు(డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ల సుజల స్రవంతి) ద్వారా సాగు, తాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రీడిజైన్ మేరకు రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాలకు భూసేకరణ వేగవంతానికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు వడివడిగా అడుగులేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్యాకేజి-15,16ల ద్వారా యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో 2లక్షల 43,500ఎకరాలకు సాగునీరందనుంది.
ఇందుకోసం తుర్కపల్లి మండలంలో 9.86టిఎంసిలతో గంధమల్ల రిజర్వాయర్‌ను, భువనగిరి మండలంలో 11.89టిఎంసిలతో బస్వాపురం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. సిఎం కెసిఆర్ చేసిన రీడిజైన్ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి పాములపర్తి రిజర్వాయర్ ద్వారా యాదాద్రి జిల్లాలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్‌లకు గోదావరి జలాలు అందనున్నాయి. ఈ రిజర్వాయర్ల పరిధిలో 39.85కిలో మీటర్ల వరకు నిర్మిస్తున్న కాలువల ద్వారా ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 200కుపైగా గ్రామాలకు గ్రామాలకు సాగునీరందనుంది. ప్రధాన కాలువల పనులు పురోగతిలో ఉన్నాయి. గత మార్చి 8న గంధమల్ల రిజర్వాయర్‌కు 860.25కోట్లు, బస్వాపురం రిజర్వాయర్‌కు 1751 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ క్రమంలో కింద చిట్యాల మండలం గుండ్రాంపల్లి, వెలిమినేడు, సుంకనపల్లి, పెద్దకాపర్తి గ్రామాలల్లో కాలువలు తవ్వేందుకు వచ్చే ఆగస్టు 23న ప్రజాభిప్రాయ సేకరణకు నిర్ణయించారు. బస్వాపురం రిజర్వాయర్ భువనగిరి, ఆలేరు ప్రాంతాలతో పాటు జంటనగరాల ప్రజలకు గోదావరి తాగు జలాలు అందించనున్నారు. అలాగే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఇప్పటికే నిర్మాణమైన ఎస్సారెస్పీ రెండో దశ కాలువలకు నీటి కొరత అధిగమించేందుకు కాళేశ్వరం కాలువలను వాటికి అనుసంధానించేందుకు సైతం ప్రభు త్వం యోచిస్తోంది. ఒకవైపు డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బిసిలతో కృష్ణా జలాలు, మరోవైపు కాళేశ్వరం, ఎస్సారెస్పీ రెండో దశ కాలువల ద్వారా గోదావరి జలాలు, మూసీ కాలువల విస్తరణతో మూ సీ జలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు భూముల దాహర్తీ తీర్చనుండటం రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది.
భూసేకరణకు రంగం సిద్ధం..!
గంథమల్ల రిజర్వాయర్ కింద తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో 63,300ఎకరాల ఆయకట్టు స్ధిరీకరించనున్నారు. ఈ ప్యాకేజిలో సిద్ధిపేట జిల్లా తిప్పారం నుండి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వరకు కాల్వలకు భూసేకరణ చేయనున్నారు. ఇందుకు సర్వే నెంబర్ల వారీగా చేయాల్సిన భూములను గుర్తించి భూముల హక్కుదారులకు నోటీస్‌లు జారీ చేస్తున్నారు. గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా నిర్మించేందుకు అదనంగా 643ఎకరాల భూసేకరణ చేయాల్సివుండగా ఇప్పటికే 106ఎకరాల సేకరించగా మరో 287ఎకరాలు సేకరించాల్సివుంది. రిజర్వాయర్ పరిధిలోని కాలువలకు 2,274ఎకరాల భూసేకరణ చేయాల్సివుంది. తుర్కపల్లి మండలంలోని గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఇందిరానగర్ తండా, తెట్టకుంట తండాల పరిధిలో 4,027ఎకరాలు ముంపుకు గురికానున్నాయి.
ప్యాకేజి 16లో 11.89టిఎంసిలతో బస్వాపురం చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. ఈ రిజర్వాయర్ పరిధిలో బస్వాపురం, తిమ్మాపూర్, లక్ష్మీనాయకునితండా, చొంగ్లానాయక్ తండాలు, వాటి పరిధిలోని 3,780ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. రిజర్వాయర్ ద్వారా ఆలేరు, తుర్కపల్లి, గుట్ట, భువనగిరి, నాగిరెడ్డిపల్లి, వలిగొండ, ఆత్మకూర్(ఎం), రామన్నపేట, చౌటుప్పల్, చిట్యాల, నారాయణపురం మండలాలకు సాగునీరందనుంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం 485ఎకరాల భూసేకరణ చేశారు. ప్రధాన కాల్వలకు1,679ఎకరాలకు 539ఎకరాలు సేకరించారు. మొత్తం కాల్వల కోసం మరో 3,500ఎకరాల భూసేకరణ చేయాల్సివుండగా ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తు భూసేకరణ దిశగా అధికార యంత్రాంగం ముందడుగు వేస్తుంది.

చిత్రం.. భువనగిరి మండలంలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం కాలువ