తెలంగాణ

టెట్ పరీక్ష రాసిన ఉపాధ్యాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, జూలై 23: ఉపాధ్యాయ పోస్టుల అర్హత కోసం నిర్వహించిన టెట్ పరీక్షను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాయడంతో గుర్తించిన డిఇఓ సుశీందర్ రావు అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయ అర్హత కోర్సులు చేసిన వారు డిఎస్సీ వంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష రాయడానికి అర్హత పరీక్షగా ప్రభుత్వం టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహిస్తోంది. అయతే ఇదివరకే ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ పరీక్ష రాయడం అనవసరం. ఒక వేళ అలా రాయాలనుకున్నా ప్రభుత్వ అధి కారుల అనుమతి తీసుకోవాలి. వనపర్తి జిల్లా పాన్‌గల్ మం డలం రేమద్దుల గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పరంధాములు అనే ఉపాధ్యాయుడు అందరి అభ్యరుల్లాగే టెట్‌కు దరఖాస్తు చేసుకొని ఆదివారం నిర్వహించిన టెట్ పరీక్షలో అభ్యర్థుల మాదిరిగానే వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా అదే పరీక్ష కేంద్రం లో అతని భార్య స్వప్న ఆలియాస్ విజయలక్ష్మి కూడా టెట్ పరీక్ష రాస్తుండడం అధికారులు గమనించారు.
పరీక్ష మొదలుపెట్టిన 15 నిమిషాలలోపే డిఇఓ పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తూ పరంధాములును గుర్తించి పరీక్ష ఎందుకు రాస్తున్నావని ప్రశ్నించగా కేవలం విజ్ఞానాన్ని పెంచుకోవడానికే టెట్ పరీక్ష రాస్తున్నానని సమాధానం చెప్పడంతో ఉన్నతాధికారుల అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించగా తడబడ్డ పరంధాములును అక్కడి నుండి ఆఫీస్ రూమ్‌కు తీసుకొని వచ్చి వివరాలు తెలుసుకోగా తన భార్య స్వప్న ఇదే పరీక్షా కేం ద్రం లో టెట్ రాస్తోందని, ఆమెకు సహాయ పడ టానికి పరీక్ష రాస్తు న్నట్టు తెలిపారు. పరీక్ష సమయం అయిపోయేంత వరకు అతడిని పరీక్షా కేంద్రంలోనే ఉం చుకొని జవాబు, ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకొని బయటికి పంపిన డిఇఓ కలెక్టర్‌కు సమాచారం అందించి ఉపాధ్యాయుడు పరంధాములును సస్పెండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేయడంతో ఉపాధ్యాయుడు పరంధాములుపై క్రిమినల్ కేసు నమోదైంది.
డిఇఓ సుశీందర్ రావు వివరణ
వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్షా కేంద్రంలో ఆదివారం పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఉపాధ్యాయుడు పరంధాములు గురించి వివరణ అడుగగా డిఇఓ సుశీందర్ రావు మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్‌గా విధు లు నిర్వహిస్తూ టెట్ పరీక్ష రాయడం అనవసరమని, ఉన్నతాధికారులు అనుమతి లేకుండా రాయడానికి అవకాశం లేదని తెలిపారు.
విచారించగా పరంధాములు భార్య స్వప్న ఆలియాస్ విజయలక్ష్మి ఇదే పరీక్ష కేంద్రంలో టెట్ పరీక్ష రాస్తున్నట్టు బయటపడిందని, ఆమెకు సహాయం చేయడం కోసమే పరంధాములు పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారణ కావడంతో అతన్ని సస్పెండ్ చేసినట్టు, అలాగే పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు డిఇఓ తెలిపారు.

చిత్రం.. పట్టుబడ్డ పరంధాములు