తెలంగాణ

జిఎస్‌టితో సిమెంట్ రంగానికి మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఠంపల్లి, జూలై 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టితో సిమెంట్ రంగానికి మేలు జరుగుతుందని నాగార్జున సిమెంట్స్ ఎండి కలిదండి రవి అన్నారు. సూర్యాపేట జిల్లాలోని పరిశ్రమ పరిధిలోని ఎన్‌సిఎల్ పాఠశాల 26వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఒకే పన్ను విధానంతో సిమెంట్ రంగానికి చాలా సమస్యలు దూరమయ్యాయని తమ పరిశ్రమలోని నాగార్జున బోర్డ్స్ 5శాతం జిఎస్‌టి వలన తగ్గిందన్నారు. త్వరలో రైల్వేలైన్‌కు సంబంధించి భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడ్తామని, దీనికి ప్రభుత్వ సహకారం ఉందన్నారు. అలాగే జిఎస్‌టి వలన మేలు జరిగినా క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే వీటిని అధిగమిస్తామని ఆయన తెలిపారు. తమ పరిశ్రమ పరిధిలో ఉన్న తండాల్లో, గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నామని, దానిలో భాగంగానే సుమారు రూ.3.50 కోట్లతో జూనియర్ కళాశాలను నిర్మిస్తున్నామన్నారు. మారుమూల ప్రాం తంలో కార్పొరేట్ స్థాయి విద్యనందించడం తన తండ్రి అయిన కలిదండి రామచంద్రరాజు లక్ష్యమని దానిని నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెఎండి గౌతమ్, విపి చక్రధర్, జిఎం శ్రీనివాస్‌రెడ్డి, మట్టపల్లి దేవాలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లి రావు, ఈఒ ఎంపి.లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌సిఎల్ ఎండి కలిదండి రవి