తెలంగాణ

అడవులతోనే వరుణుడి కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 23: సిఎం కెసిఆర్ సారధ్యం లో హరిత విప్లవం సాధిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర రవాణ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిదిలోని ప్రజ్ఞాపూర్ బస్‌డిపో వద్ద మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలో 2కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతమవుతుందని, కరువు కాటకాదుల నుంచి గట్టెక్కి సంవృద్ధిగా వర్షాలు పడేందుకు మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరూ లక్ష్యంగా పెట్టుకోవాలని కోరారు. అడవులు 33 శాతం ఉండాల్సి ఉండగా, 22 శాతానికి పడిపోయినట్లు తెలిపారు. వాతావరణ కాలుష్య నివారణతో పాటు భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువునిచ్చే మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని, జీవ వైవిద్యాన్ని కాపాడి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణకు మొక్కల పెంపకం దోహదం చేయనుండగా, భవిష్యత్తు తరాలకు శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంతో సిఎం కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి అన్ని వర్గాలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛందసేవా సంస్థలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, హరితరక్షణ కమిటీలకు భాగస్వామ్యం కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్, జిపిపి డిపో మేనేజర్ పాల్, జిపిపి డిపో గౌరవ అధ్యక్షులు కళ్యాన్‌కర్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ప్రజ్ఞాపూర్ బస్‌డిపో వద్ద మొక్కలు నాటుతున్న మంత్రులు ఈటల, మహేందర్‌రెడ్డి