తెలంగాణ

కరవు ప్రాంతాలకు బిజెపి బృందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో నెలకొన్న కరవు, దుర్భిక్ష ప్రాంతాల్లో పర్యటించి, సమగ్ర నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలని బిజెపి రాష్ట్ర శాఖ సమాయత్తమైంది. మంగళవారం ఉదయం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని మేడిపల్లి, మల్కిగూడ, యచారంలో పర్యటించి రైతులను, ముఖ్య నేతలను కలుసుకోనున్నారు. బుధవారం బిజెపి శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కరవు పరిస్థితులను అధ్యయనం చేయనున్నది. ఈ విధంగా 10 జిల్లాలకు కరవు బృందాలు వెళ్ళనున్నట్లు కిషన్ రెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారు నివేదికలు సమర్పించగానే వాటిని క్రోఢీకరించి గవర్నర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నంత మాత్రాన బంగారు తెలంగాణ సాధ్యమని భావిస్తున్నదా? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరిట కాంట్రాక్టర్ల పెద్ద మొత్తంలో డబ్బులు కట్టబెడుతూ అవకతవకలకు పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 5 లక్షల చెరువుల పునరుద్ధరణ పనలు చేపట్టిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం టిఆర్‌ఎస్ కార్యకర్తలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిందని ఆయన విమర్శించారు. ఫిరాయింపులపై ఉన్నంత శ్రద్ధ కరవు నివారణపై లేదని ఆయన విమర్శించారు. పంట రుణాలు అందడం లేదని, చేతి వృత్తుల వారు, గొర్రెల కాపరుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని, వచ్చే ఎన్నికల నాటికి తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించామని ఆయన చెప్పారు.

చిత్రం సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతున్న
బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి