తెలంగాణ

ఎడ్‌సెట్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎడ్‌సెట్ -2017 ప్రవేశపరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం సాయంత్రం విడుదల చేశారు. 16వ తేదీన నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మినహా మిగిలిన వారందరికీ కనీసం 25 శాతం మార్కులను కటాఫ్‌గా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.
పరీక్షకు 64,029 మంది హాజరుకాగా, వారిలో 58,738 మంది హాజరయ్యారని, 57,413 మంది అర్హత సాధించారని చెప్పారు. 19253 మంది అబ్బాయిలు, 44,776 మంది అమ్మాయిలు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 17,237 మంది అబ్బాయిలు, 40,176 మంది అమ్మాయిలు అర్హత సాధించారని, మెథడాలజీ వారీ చూస్తే గణితంలో 12,107 మందికి 12,021 మంది , ఫిజికల్ సైన్స్‌లో 3951 మందికి 3859 మంది, బయాలజీలో 14670 మందికి 14435 మంది, సోషల్‌లో 27071 మందికి, 26168 మంది, ఇంగ్లీషులో 939 మందికి 930 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. పాసైన వారందరికీ ర్యాంకులు ఇచ్చినట్టు తెలిపారు. వారం రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ప్రొఫెసర్ సి మధుమతి తదితరులు పాల్గొన్నారు.