తెలంగాణ

9న కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి.పిసిసి) కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో గత నెల 31న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, టిడిపిలు బహిష్కరించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు జలయజ్ఞం పేరిట అనేక ప్రాజెక్టులకు 85 శాతం వరకు పనులు పూర్తి చేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నీ తామే చేశామని చెప్పుకుంటున్నారని టి.పిసిసి నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము చేపట్టిన ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9న గాంధీ భవన్‌లో లేదా మాసాబ్ ట్యాంక్‌లోని హోటల్ గోల్కండలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇలాఉండగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కేవలం మీడియా ద్వారా ప్రజలకు చూపించడమే కాకుండా టిఆర్‌ఎస్‌ను, ఇతర ప్రతిపక్షాలనూ ఆహ్వానించే విషయం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.