తెలంగాణ

నందనంగా నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4:4హైదరాబాద్ ఎట్లుండేది? ఎట్లున్నది? ఎట్లుండాలి?2 అనే విషయాలు బేరీజు వేసుకుని అభివృద్ధికి కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ పాలన వ్యవహారాలపై అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు.
మనం కోరుకున్న విధంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో కార్పొరేటర్లది కీలక పాత్ర కాబట్టి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దామని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న స్థితిగతులను పూర్తిగా అవగతం చేసుకొని భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా నగరాన్ని తీర్చిదిద్దాల్సిన తక్షణ కర్తవ్యం కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వాలవల్ల జిహెచ్‌ఎంసి ఆర్థిక పరిస్థితి దిగజారిందని ముఖ్యమంత్రి అన్నారు. కొత్తగా ఎన్నికైన హైదరాబాద్ కార్పొరేటర్లకు ఈనెల 11,12 తేదీల్లోనూ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు చెందిన టిఆర్‌ఎస్ కార్పొరేటర్లకు ఈనెల 13న ప్రగతి రిసార్ట్స్‌లో ఆస్కి ఆధ్వర్యంలోనూ శిక్షణ నిర్వహిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆయా కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లను కూడా శిక్షణ తరగతులకు పిలిచి వారి అనుభవాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గోనాలని కోరారు.
జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలు ఓ సునామీలా ఓట్లు వేసి టిఆర్‌ఎస్‌ను గెలిపించారని అన్నారు. గుజరాతీలు, బెంగాలీలు, కన్నడిగులు, ఆంధ్ర ప్రాంతం వారు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వేశారని అన్నారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేయాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 4700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కట్టిస్తామని, దీనికి స్థలాల అనే్వషణ జరుగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కలిసి పని చేస్తే ఇది సాకారం అవుతుందని అన్నారు.
నగరంలో కాపిటల్ అసెట్స్ పెరగడానికి, రోడ్లు బాగుపడడానికి జిహెచ్‌ఎంసి నిధులు కేటాయించాలని సూచించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఐఎల్‌ఎఫ్‌ఎస్, ఇర్కాన్, బ్రిక్స్ బ్యాంక్ లాంటి సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. నగరాభివృద్ధి విషయంలో నాగపూర్, ముంబాయి, ఢిల్లీ తదితర నగరాల్లో అమలయ్యే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని కోరారు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఈ విషయాన్ని పారిశ్రామికవేత్తలకు విడమరిచి చెప్పాలని, వారిలో విశ్వాసం నింపాలని సూచించారు.హైదరాబాద్‌ను స్లమ్‌లెస్ సిటీగా మార్చే ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి ఐదువేలమందికి ఒక ప్రజా కమిటీ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.