తెలంగాణ

నియోజకవర్గాల వారీగా భూమి లభ్యతను తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: హైదరాబాద్ నగరంలో నియోజక వర్గాల వారిగా ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో వివరాలతో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నియోజక వర్గంలో అందుబాటులో ఉన్న భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, పాత ఇండ్ల ను తొలగించుకుని కొత్త ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధపడే బస్తీలు ఎన్ని? తదితర అంశాలతో నివేదిక రూపొందించాలని సిఎం కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌పై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. సమాంతరంగా అన్ని నియోజక వర్గాల్లో ఒకేసారి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టాలని సిఎం ఆదేశించారు.