తెలంగాణ

28 కంపెనీలతో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఐటీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మాన్యుఫాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ సెంటర్స్, గేమింగ్, యానిమేషన్ పాలసీలకు మంచి ఆదరణ లభించింది. పాలసీలు ప్రకటించిన తొలి రోజుననే 28 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు సమకూరడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనుంది.
సింగపూర్‌కు చెందిన డవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన వాల్యూ లాబ్స్ ఆర్ట్ క్యాంపస్ నెలకొల్పడానికి రూ.1362 కోట్లు పెట్టుబడి పెట్టనుంది, దీని ద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
కార్వే సంస్థ మరియు తెలంగాణ గవర్నమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హౌస్ ఏర్పాటు చేయడం ద్వారా 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న కంపెనీలలో ఇంకా ఫ్రాక్టల్ అనలిస్టిక్, మాక్స్ టచ్, ఎల్‌ఇడి మాన్యుఫ్యాక్చర్స్ ఎస్‌పివి, క్యాలిటీ ఫోటోనిక్స్, యాక్సిమ్, యుఎన్‌డిపి, ఏరీస్ గ్రూప్ (దుబాయి), క్యాసికో అండ్ టాస్క్, ఎస్‌ఎపి ఎడ్యుకేషన్ టాస్క్, మెక్రోసాఫ్ట్, సిడిఎస్ అండ్ టాస్క్, ఐసిసిఐ ఫౌండేషన్ అండ్ టాస్క్, యూనివర్సిటీ కేంబ్రిడ్జి అంట్ టాస్క్, నాస్కామ్, ఎస్ బ్యాంక్ అండ్ టి-హబ్, హెచ్‌పియి అండ్ టి-హబ్, క్యాసికో, టిఐఇ అండ్ టి-హబ్, హైసీ అండ్ టి-హబ్, ఇమామి అండ్ టి-హబ్, టాలెంట్ స్ప్రింట్ అండ్ టి-హబ్, ఇన్‌సైడ్ వ్యూ అండ్ టి-హబ్ తదితర కంపెనీలు ఉన్నాయి.