తెలంగాణ

రాయితీల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ఐటీ రంగంలో దేశంలోనే రెండవస్థానానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి దోహదపడే విధంగా ఐటీ పాలసీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. హెచ్‌ఐసిసిలోప్రకటించిన ఐటీతో సహా ఇతర నాలుగు అనుబంధ రంగాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటించింది. ఐటీ సంస్థలను స్థాపించడానికి వచ్చే సంస్థలకు అవసరమైన మేరకు భూమిని సమకూర్చనున్నట్టు పాలసీలో పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి కల్పించిన విధంగానే విద్యుత్ సరఫరాకు ధరలలో రాయితీలను ప్రకటించింది. ఐటీ కంపెనీల స్థాపనలో మెగా ప్రాజెక్టులు మినహాయించి ఇతర కంపెనీలకు రిజిస్ట్రేషన్‌లో మొదటి విడతలో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ 100 శాతం రియింబర్స్‌మెంట్, రెండవ విడతలో 50 శాతం రియింబర్స్‌మెంట్ ప్రకటించింది. ఇండియన్ పేటెంట్ రైట్ వ్యయంలో ఐదు లక్షలు, ఇంటర్నేషనల్ పేటెంట్ రైట్‌కు 10 లక్షల రియింబర్స్‌మెంట్ ప్రకటించింది. క్వాలిటీ సర్ట్ఫికేట్ వ్యయంలో 20 శాతం రియింబర్స్‌మెంట్ ప్రకటించింది. సోలార్ పవర్ స్థాపనలో 20 లక్షల పెట్టుబడికి 10 శాతం సబ్సిడీ ప్రకటించింది. ఐటీ కంపెనీల స్థాపనలో ఐటీ నిపుణులను తెలంగాణ కాలేజీల నుంచి అందించే విధంగా ప్రభుత్వ సహకారం.
ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే లక్ష్యం పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో మిలియన్ చదరపు అడుగుల విస్థీర్ణంలో స్టార్టప్‌ల స్థాపనకు అవకాశం కల్పించడం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 20 గ్లోబల్ కంపెనీలు స్టార్టప్‌ల స్థాపన లక్ష్యం. వీటిని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పిపిపి) విధానంలో ఏర్పాటుకు అవకాశం.
హైలైట్స్
టి-హబ్ ఫేస్-2లో 3 లక్షల చదరపు అడుగుల విస్ణీర్ణంలో 900 స్టార్టప్‌ల స్థాపనకు అవకాశం.
రాష్ట్రంలో టైర్-2 నగరాలలో రెండు ఇంక్యుబేటర్లు ఏర్పాటు
వివిధ రంగాలకు చెందిన స్టార్టప్‌ల స్థాపనకు 2000 కోట్ల పెట్టుబడులు సమకూర్చడం.
ఐదు ఇన్నోవేషన్ స్టార్టప్‌లను అగ్రికల్చర్, హెల్త్, క్లీన్ ఎనర్జీ, స్మార్ట్‌సిటీలకు ప్రభుత్వ వినియోగం.