రాష్ట్రీయం

బయటికొస్తే.. భగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు నెలల వరకు తీవ్రం నుండి అతితీవ్రమైన ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. గత సంవత్సరం తీవ్రమైన ఎండల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో 2,500 మంది ప్రాణాలు కోల్పోయారని, అందువల్ల ఈ సంవత్సరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఐఎండి పరోక్షంగా హెచ్చరించింది. తీవ్రమైన ఎండల వల్ల మనుషుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని, జలాశయాల్లో నిలువ ఉండే నీటిపై కూడా ఎండల ప్రభావం ఉంటుందని అలాగే విద్యుత్తు ఉత్పత్తిపై కూడా ప్రభావం ఉంటుందని వివరించారు. ఇక నుండి ప్రతి ఐదు రోజులకు ఒక పర్యాయం వాతావరణ పరిస్థితులపై తాజా నివేదికలను విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోని మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో (ఒడిషా, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం తదితర రాష్ట్రాలు) పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎపిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో గత ఏడాది ఏర్పడ్డ ‘ఎల్‌నినో’ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని పూనెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రోలజీ (ఐఐటిఎం) ప్రకటించింది. అయితే ఎల్‌నినో ప్రభావం క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. గత ఏడాది ఎల్‌నినో ప్రభావం ఏర్పడటం వల్ల 2016 లో అంటే ఏప్రిల్-మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గతలో కూడా ఎల్‌నినో ఏర్పడ్డ సంవత్సరం తర్వాత వేసవిలో అత్యధిక ఎండలు రికార్డయ్యాయని గుర్తు చేశారు. 2015 లో ఎల్‌నినో ఏర్పడ్డందువల్ల 2016 వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు.