తెలంగాణ

పేపర్‌లెస్ వర్సిటీగా జెఎన్‌టియు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: హైదరాబాద్‌లోని జెఎన్‌టి యూనివర్శిటీ రానున్న రోజుల్లో జాతీయ స్థాయికి ఎదగాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. క్యాంపస్‌లో బాలుర హాస్టల్‌ను ప్రారంభించేందుకు వచ్చిన కడియం శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో నెంబర్ వన్ వర్శిటీగా ఉంటే సరిపోదని, జాతీయ స్థాయిలో ఎన్‌ఐటిలు, ఐఐటిల స్థాయిలో వాటి సరసన నిలవాలని సూచించారు. వాటితో విద్యలోనూ, వసతుల్లోనూ, విద్యార్ధులకు ఉపాధి అవకాశాలను కల్పించడంలోనూ పోటీ పడాలని అన్నారు.జెఎన్‌టియు హైదరాబాద్ కాగితం ఉపయోగించని, పూర్తిగా ఆన్‌లైన్ యూనివర్శిటీగా మారాలని ఏడాది కాలంలో యూనివర్శిటీలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌లోకి మారాలని పేర్కొన్నారు. విద్యార్ధి ఎవరి వద్దకూ వెళ్లకుండా దరఖాస్తు చేసుకునే పరిస్థితి రావాలని చెప్పారు.
జెఎన్‌టియులో ఐసిటి వినియోగం వంద శాతానికి పెంచాలని, విద్యా ప్రమాణాలను పెంచడం, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెన్నకగన్న మంచి యూనివర్శిటీలతో పోటీ పడాలని , పరస్పరం ఎక్చ్సేంజి ప్రోగ్రాంలను రూపొందించాలని చెప్పారు. దానివల్లవిద్యార్ధుల్లో నమ్మకం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. యూనివర్శిటీని అందంగా లేఅవుట్ చేసి, రీ డిజైన్ చేసుకోవాలని, క్రీడలు, ఇతర సౌకర్యాలను పెంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పట్టణాలకు సలహాలు ఇచ్చే జెఎన్‌టియు తమ సొంత యూనివర్శిటీని తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. యూనివర్శిటీలోకి రాగానే దాని గొప్పదనం కనిపించాలని, యూనివర్శిటీలోకి రాగానే గొప్ప అనుభూతిని కల్పించవచ్చని తెలిపారు. గతంలో యూనివర్శిటీలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఇప్పటికైనా వాటికి సరికొత్త రూపాన్ని ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.