తెలంగాణ

ఆరు కిలోల బంగారం హుష్‌కాకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: అభరణాలు రూపొందించే నలుగురు వ్యక్తులు దాదాపు ఆరు కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. భారీ ఎత్తున జరిగిన ఈ వ్యవహారం గత నెలలోనే జరిగినా ఇప్పటివరకు పోలీసులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. ఆభరణాల తయారీదారులు ఎత్తుకెళ్లిన బంగారం మొత్తం 6 కిలోలా లేక తక్కువగా తీసుకువెళ్లి ఎక్కువచేసి చెబుతున్నారా అనే విషయంపై పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు. కోల్‌కతాకు చెందిన గులామ్ ముస్త్ఫా, షాజన్ షేక్, చోపన్‌మండల్, గుజరాత్‌కు చెందిన కరణ్ అలియాస్ హర్మిందర్ అనే ఆభరణాల తయారీదారులు గత రెండేళ్లుగా హిమాయత్‌నగర్‌లోని పిఎంజె జువెలర్స్‌లో బంగారాన్ని తీసుకొని అభరణాలు రూపొందించి ఇస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరిపై నమ్మకంతో పెద్ద మొత్తంలో బంగారాన్ని పిఎంజె జువెలర్స్ యాజమాన్యం అభరణాల తయారీ కోసం వీరికి ఇస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో బంగారాన్ని తీసుకువెళ్లిన నలుగురు వ్యక్తులు రోజులు గడుస్తున్నా అభరణాలను తెచ్చి ఇవ్వకపోవడం, వారి ఫోన్ నెంబర్లు కూడా పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన పిఎంజె యజమానులు గత నెల 19న నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులకు ఇప్పటివరకు నిందితుల ఆచూకీ మాత్రం తెలియలేదని సమాచారం. పిఎంజె యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదున్నర కిలోల బంగారాన్ని వారు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోందని నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి తెలిపారు. అయితే రూ.కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లిన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పోలీసులు సరైన వివరణ ఇవ్వడం లేదు. మహారాష్టల్రో ఒక నిందితుడు ఉన్నట్లుగా సమాచారం ఉందని, త్వరలోనే అందరినీ పట్టుకుంటామని భీంరెడ్డి తెలిపారు.