తెలంగాణ

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: వ్యవసాయ రంగం, పేద వర్గాల వారికి ఇస్తున్న విధంగానే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని తెలంగాణ ఫ్యాప్సీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిని కోరారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం మొత్తం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి నిర్దేశించినట్లుగా కాకుండా, తక్కువ సబ్సిడీని విద్యుత్ సంస్థలకు మంజూరు చేసిందన్నారు. దీని వల్ల డిస్కాంలపై భారం పడి విద్యుత్ చార్జీలను పెంచాలని ప్రతిపాదించారన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు 2016-17 ఆర్థిక సంవత్సరానికి అమలు చేసేందుకు ప్రతిపాదించిన ధరలపై రెండవ రోజు గురువారం విచారణ కొనసాగింది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే రంగాలకు సంబంధించి విద్యుత్ టారిఫ్ విధానంపై బహిరంగ విచారణను నిర్వహించారు. ఈ సమావేశంలో అనిల్ రెడ్డి మాట్లాడుతూ 250 కెవి విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం ద్వారా వారిని ప్రోత్సహించవచ్చునని సూచించారు.మరో వాణిజ్య ప్రతినిధి జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎల్-3 పరిధిలో ఉన్న వాటర్ పరిశ్రమలను ఎల్-2లోకి మార్చారని దీంతో బిల్లు అధికంగా వస్తూ పరిశ్రమల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. రైస్‌మిల్లర్లకు డిమాండ్ చార్జీలు తగ్గించాలని దయాకర్ రెడ్డి కోరారు. ఆసుపత్రులను వాణిజ్య కేటగిరిలో కాకుండా, సేవా రంగంగా గుర్తించి రాయితీ ఇవ్వాలని ఆయన కోరారు. కొన్ని ఆసుపత్రులు డబ్బే ప్రధానంగా పనిచేస్తుండవచ్చు కాని చాలా ఆసుపత్రులు సేవాభావంతో పనిచేస్తున్నాయని, ఈఆర్‌సి దీనిని గుర్తించాలని అభ్యర్థించారు.అనంతరం సిఎండి రఘుమారెడ్డి మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని చెప్పారు.